మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా తెలంగాణ.. నిఘా వర్గాల హై అలర్ట్!

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….

Read More

తెలంగాణలోనే మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ? పోలీసులు ఏం చెబుతున్నారు?

మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్‌జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు…

Read More

మల్లోజుల, ఆశన్న ఆధ్వర్యంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ.. ఏర్పడేది అప్పుడే!

మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నది. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పని చేయనున్నది. ఒక జాతీయ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్‌లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళతారా? అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ‘‘ప్రజల కోసం…

Read More

టైగర్ల ఓటమిపై సమగ్ర సమీక్ష.. అన్వయించడంలో మావోయిస్టులు ఫెయిల్!

ప్రత్యేక తమిళ ఈలం(తమిళ దేశం) కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో అంతిమ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని ఏళ్ల తరబడి తన కంట్రోలులో ఉంచుకుని, పాలన చేపట్టి, వాయు, నౌకాబలగాలు సహా 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు ఘోర ఓటమిని చవిచూసింది. క్రమక్రమంగా శ్రీలంక సైన్యాలు తమ భూభాగాన్ని చుట్టుముడుతున్నాయని, తమ ఏరియా కుంచించుకుపోతున్నదని తెలిసినా,…

Read More

ఆపరేషన్ కగార్.. మావోయిస్టు పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే!

ఆపరేషన్ కగార్‌ను అంచనా వేయడంలో జరిగిన ఘోర తప్పిదం మూలంగానే మావోయిస్టు పార్టీ.. చరిత్రలోనే కనీ వినీ ఎరుగని నష్టాలను చవిచూసిందా? ఆ పార్టీ కార్యదర్శి బసవరాజ్ సహా పలువురు సీసీ, ఎస్‌జెడ్సీ, డీవీసీ సభ్యులు, హిడ్మా సహా పీఎల్జీఏ బెటాలియన్, కంపెనీ, ప్లాటూన్ల కమాండర్లు, కీలక సభ్యులు చనిపోవడానికి పొలిట్‌బ్యూరో తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమా? 2024 ఆగస్టులో విడుదల చేసిన సర్క్యులర్‌లో పార్టీ శ్రేణులకు, గెరిల్లా బలగాలకు సరైన వ్యూహం-ఎత్తుగడలను కనుక సూచించి ఉంటే…

Read More

ప్రభాకర్‌రావుకు మరో వారం పాటు కస్టడీ పొడిగింపు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అనుమానితుడు, ప్రస్తుతం తెలంగాణ పోలీసుల కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావు కస్టడీని సుప్రీంకోరుట్ ఈ మధ్యాహ్నం మరో వారం పాటు పొడిగించింది. తమ విచారణకు ఆయన సహకరించడం లేదని, నోరు విప్పడం లేదని పోలీసులు సమర్పించిన కస్టోడియల్ రిపోర్టుకు పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును మరింత వేగంగా, ఎఫెక్టివ్ గా విచారించడానికి నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సజ్జనార్…

Read More

పుస్తకాలు కొనడమేనా.. చదివేది ఏమైనా ఉందా..?

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏర్పాట్లు ఎన్టీఆర్ స్టేడియంలో వేగంగా జరుగుతున్నాయి. కరోనా తర్వాత బుక్ ఫెయిర్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఈతరం యువతీ యువకులు, జెన్‌జీ తరం సైతం పెద్దయెత్తున వచ్చి పుస్తకాలు కొంటున్నారు. జిల్లాల నుంచి కూడా సందర్శకులు వచ్చి చూసి పోతున్నారు. ఆ పది రోజులూ హైదరాబాద్ వీధులు పుస్తకాల శోభను సంతరించుకుంటున్నాయనడంలో కూడా అతిశయోక్తి లేదు. ప్రముఖులు కలిసే చోటు.. బుక్ ఫెయిర్ అనేది కొత్త, పాత…

Read More

ఆసిఫాబాద్ లో మావోయిస్టులు.. డిజీపీ ప్రెస్ మీట్‌పై ఉత్కంఠ..

మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ లో కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? తెలంగాణ కేడర్ ఉన్నారా? మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్లేనా? వంటి విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే, ఆ సస్పెన్స్ ఈరోజు వీడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టులో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాటును లేదంటే అరెస్ట్ ను చూపించడానికే ఈ సమావేశం…

Read More

సోనూ, ఆశన్న చేసిన తప్పులివే.. ఆయుధాలు వదిలేయడం చరిత్రలో కొత్త కాదా?

మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన సోనూ, ఆశన్న తదితరులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియస్ చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా వాళ్లు మూకుమ్మడిగా ఆయుధాలు వదిలేసి, పోలీసుల ఎదుట లొంగిపోవడాన్ని నెటిజన్లు, మేధావుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే వారిని ద్రోహులుగానే అభివర్ణిస్తున్నారు. ఇలాంటి మేధావులపై ఇటీవల సోనూ, ఆశన్న తదితరులు తీవ్రంగా విరుచుకు పడుతూ మాజీ మావోయిస్టుల పేరుతో పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో చరిత్రకు, రాజకీయాలకు సంబంధించిన కొన్ని వివరాలు…

Read More

టాక్టికల్ రిట్రీటే ఏకైక మార్గం.. చిన్న టీంలుగా తిరగాలంటూ మావోయిస్టు పార్టీ సర్క్యులర్..

ఆయుధాలు వదిలేద్దామని, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టమని మావోయిస్టు పార్టీలో గత రెండేళ్ల నుంచే అంతర్గత చర్చ జరుగుతున్నట్లుగా నిన్న కొన్ని దిన పత్రికలు, టీవీ చానెళ్లు వార్తలు పబ్లిష్ చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర రాష్ట్రాల కమిటీలు ఈ అభిప్రాయంతో ఉన్నాయని 2024 ఆగస్టులో వెలువడిన పొలిట్ బ్యూరో సర్క్యులర్ లో అలా ఉన్నట్టు రాశాయి. అంటే సోనూ అలియాస్ మల్లోజుల వేణు లేఖ బయటకు రాకముందే ఇలాంటి చర్చ ఆ…

Read More