ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అనుమానితుడు, ప్రస్తుతం తెలంగాణ పోలీసుల కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావు కస్టడీని సుప్రీంకోరుట్ ఈ మధ్యాహ్నం మరో వారం పాటు పొడిగించింది. తమ విచారణకు ఆయన సహకరించడం లేదని, నోరు విప్పడం లేదని పోలీసులు సమర్పించిన కస్టోడియల్ రిపోర్టుకు పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసును మరింత వేగంగా, ఎఫెక్టివ్ గా విచారించడానికి నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో ప్రత్యేక సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమర్థుడిగా పేరున్న సజ్జనార్.. ఈ కేసును తనదైన శైలిలో త్వరలోనే ఛేదించగలరని, దోషులకు శిక్ష పడేలా చూడగలరని పరిశీలకులు భావిస్తున్నారు.
