సుదీర్ఘకాలం మావోయిస్టు రాజకీయాల్లో పనిచేసిన కనకరాజు పద్మావతి అలియాస్ పద్మ, జూరీ, రాజేశ్వరి క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న రాత్రి బెంగళూరులో కన్నుమూశారు. జననాట్యమండలి నేత దివాకర్‌కు సొంత చెల్లెలయిన పద్మ 1990లలోనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి 2001 వరకూ పనిచేసింది. ఆ తర్వాతి కాలంలో మావోయిస్టు పార్టీ నుంచి చీలిపోయిన కర్ణాటక విప్లవకారులతో చేరి చివరి వరకూ అందులోనే పనిచేసింది. ఝరి అనే పేరుతో పలు రచనలు సైతం చేసింది. పద్మ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరులో జరుగుతాయని తెలిసింది.
