Friday, January 9, 2026

ఆసిఫాబాద్ లో మావోయిస్టులు.. డిజీపీ ప్రెస్ మీట్‌పై ఉత్కంఠ..

మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ లో కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? తెలంగాణ కేడర్ ఉన్నారా? మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్లేనా? వంటి విషయాలు వెలుగులోకి రాలేదు.
అయితే, ఆ సస్పెన్స్ ఈరోజు వీడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టులో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాటును లేదంటే అరెస్ట్ ను చూపించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
అదుపులో ఉన్న మావోయిస్టులలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి కనుక ఈ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Latest News