మరోకోణం: జీవన్‌రెడ్డి పార్టీ మార్పు.. రాజకీయ పునరుజ్జీవమా? పతనమా?
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సిద్ధాంతాల పట్ల నిబద్ధత, సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న నాయకుడిగా జగిత్యాల సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డికి తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆయనొక వటవృక్షం. అయితే, నాలుగు దశాబ్దాల పాటు ఏ పార్టీనైతే నమ్ముకున్నారో ఆ కాంగ్రెస్‌ను ఆయన ఇటీవల వదిలిపెట్టడం వివాదాస్పదమైంది. ఏ నాయకత్వాన్నైతే ఇంతకాలం తూర్పారబట్టారో అదే బీఆర్ఎస్ గూటికి చేరడం ద్వారా జీవన్ తన రాజకీయ…
