Friday, September 19, 2025

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయని భావించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడడం, పైగా తన చావుకు అధికారుల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టించింది. 2002 బ్యాచ్‌కు చెందిన శర్మ గతం లో బస్తర్‌లోని దంతేవాడ జిల్లా ఎస్‌పీగా పనిచేస్తూ మావోయిస్టు ఉద్యమ అణచివేత లో ప్రతిభ కనబర్చిన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ కాలంలోనే ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ బస్తర్ అడవులకు వెళ్లడం, ఆ క్రమంలో ఎస్‌పీ శర్మను కలువ డం తటస్థించింది.

అప్పటికే మావోయిస్టు దళాల వెంట తిరిగి వారి కార్యకలాపాలను అధ్యయనం చేసిన రాయ్ ఉద్యమానికి సంబంధించిన వివిధ అంశాలపై శర్మను ఇంట ర్వ్యూ చేయగోరింది. అందుకు శర్మ సమ్మతించి ఆమె అడిగిన ప్రశ్నలకు సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానాలిచ్చాడు. ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివిన తనకు మావోయిస్టు ల ఉద్యమం వెనకాల ఉన్న సామాజిక, ఆర్థిక కారణాలు తెలుసునని వివరించాడు. తన సంభాషణను ముగిస్తూ దంతేవాడలో యుద్ధ పరిస్థితులు పోయి శాంతి నెలకొనడానికి ఒకే ఒక మార్గముందని, అక్కడి ఆదివాసీలకు స్వార్థం నేర్పితే చాలని చమత్కరించాడు.

అవి అక్షర సత్యాలు..

దివంగత శర్మ ఆ మాటలు ఏ ఉద్దేశంతో అన్నాడో కాని వర్తమాన కాలంలో అవి అక్షరసత్యాలని మాత్రం చెప్పవచ్చు. 190ల చివరన అగ్రరాజ్యం అమెరికా సారథ్యా న బహుళజాతి కంపెనీల దన్నుతో, ఆయా దేశాల పాలకవర్గాల అండతో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు క్రమంగా సగటు మానవుడిలో స్వార్థాన్ని పెంచుతున్నాయి. పక్కనున్న వారి సంగతిని వదిలేసి ఎవరి బతుకు గురించి వారు ఆలోచించడమే మంచిదన్నది నేర్పుతున్నాయి. మానవజన్మ ఎత్తిందే అనుభవించడానికని, ఏ పని చేస్తున్నావన్నది, ఎవరి పొట్ట కొడుతున్నావన్నది ముఖ్యం కాదని, సంపాదించడమన్నదే అసలు విషయమన్న మర్మాన్ని విప్పి చెబుతున్నాయి.

ఫలితంగా సమాజంలో అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, ఆశ్రీతపక్షపాతం పెచ్చరిల్లిపోయింది. స్వార్థమన్నది కొందరు వ్యక్తుల్లో ఆస్తుల సంపాదన రూపంలో ఉంటే మరి కొందరిలో ఎంతకైనా తెగించి పదవు లు పొందడం రూపంలో ఉంది. ఈ రెండు రకాల స్వార్థం లేదనుకున్న వారిలో కీర్తికండూతి ఉండనేవుంది. ఈ మూడు రకాల స్వార్థం బడుగు, మధ్యతరగతి వర్గాల్లోకి, చదువుకున్న విద్యావంతుల్లోకి చాప కింద నీరులా వ్యాపించడం అన్ని రకాల ఉద్యమాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిం ది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాలు గత 20 ఏళ్ల కాలంలో క్రమంగా నీరుగారిపోతున్నాయి. విప్లవోద్యమాలే కాకుండా జాతుల, కులాల, మతాల, వివిధ వర్గాల అస్తిత్వం కోసం, ఆకాంక్షల కోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటాలు కూడా బలహీనపడుతున్నాయి.

అది త్యాగాల కాలం..

శర్మ ప్రస్తావించిన మావోయిస్టు ఉద్యమాన్నే పరిశీలిద్దాం. 1960ల చివరన నక్సల్బరీలో నిప్పు రగిలినప్పుడు, ఆ నిప్పు దావానలమై మొదట శ్రీకాకుళాన్ని ఆ తర్వాతకాలంలో ఉత్తర తెలంగాణను, దండకారణ్యాన్ని, బీహార్, బెంగాల్‌లను చుట్టుముట్టినప్పుడు పోరాటాలను ముందుండి నడిపినవాళ్లు సమాజం గురించి తప్ప మరో ఆలోచన లేని ఉడుకు రక్తము న్న యువకులు. స్వంత ఆస్తులనూ, కుటుంబాలనూ వదిలి ఉద్యమంలో దూకినవాళ్లు. వాళ్లు పనిచేసిన కార్యక్షేత్రమూ లాభాలే ప్రాతిపదికగా నడిచే పెట్టుబడిదారీ సమాజం కాదు. శ్రీకాకుళం గిరిజనులైనా, ఉత్తర తెలంగాణ రైతులైనా, దండకారణ్య గోండులైనా నిష్కల్మష మనస్తత్వంతో నిష్కళంక జీవితాలను గడుపుతున్నవారే. సమూహమే సర్వస్వంగా బతుకుతున్నవారే.

తాము ఎంత దారివూద్యంలో బతికినా, తినడానికి తిండి కూడా లేకపోయినా ఇంటికి వచ్చిన అపరిచితులను సైతం ఆత్మీయంగా పలకరించి అన్నం పెట్టడం, ఇరుగుపొరుగు బాధలను తమ బాధలుగా భావించడం వారి నైజంగా ఉండింది. అలాంటి చోట తమ బతుకులను మార్చుకోవడం ఎలా గో తెలుపడం కోసం వచ్చిన అన్నలను వాళ్లు అక్కున చేర్చుకున్నారు. పోలీసులు ఎంత వేధించినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా పార్టీ ఆనుపానులు బయట పెట్టలేదు. పలు ఘటనల్లో నక్సలైట్లను పోలీసుల నుంచి తప్పించడానికి స్రజలు తమ ప్రాణాలను పైతం పణంగా పెట్టారు. ఓ జగిత్యాల తల్లి, మరో గడ్‌చిరోలి చెల్లి విప్లవకారులను తమ కుటుంబసభ్యుల కంటే కూడా ఆప్యాయంగా, ఉన్నతంగా చూసేవారంటే వారిలో సామాజిక స్పృహ ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

1990లలో మార్పు మొదలు..

1990ల వరకూ ఉన్న పరిస్థితి ఇది. అప్పుడే దేశంలో సంస్కరణల శకం ఆరంభమైంది. 1991లో పీవీ-మన్మోహన్ ద్వయం ముందుకు తెచ్చిన ఆర్థిక విధానాలు పల్లె ల్లో, పట్టణాల్లో పెనుమార్పులు తెచ్చాయి. అన్ని రంగాల్లో విదేశీ బహుళజాతి కంపెనీ ల ప్రవేశం, ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, సెజ్‌ల ఏర్పాటు, లాభాల వేటకు నాంది పలికింది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు రాజకీయ నాయకులకు, అధికారులకు కోట్లు కురిపిస్తే కాంట్రాక్టులు, సబ్‌కాంవూటాక్టులు, చిన్నచిన్న పనులు పొంది అక్రమాల రుచిమరిగిన ఒక కొత్త వర్గం పల్లెపప్లూనా పుట్టుకొచ్చింది.

సామాజిక, ఆర్థిక సమీకరణాలు మారిపోయాయి. ఇక ఇంటింటా కలర్ టీవీలు, మొబైల్ ఫోన్లూ వచ్చి మధ్య తరగతికి కొత్త బంగారులోకాలను పరిచయం చేశాయి. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు వెనుకపట్టు పట్టాయి. బడుగు, బలహీనవర్గాలు సైతం పశ్చిమ సంస్కృతి ప్రభావానికి లోనయ్యాయి. పునాదితో పాటుగా ఉపరితల మూ క్రమంగా మారింది. డబ్బుకు సమాజం దాసోహమంది. నువ్వు బాగుంటే చాలు కదా! పక్కోడి సంగతి నీకెందుకనేవాళ్లు పెరిగారు.

విప్లవోద్యమం బలహీనం..

ఈ పరిణామం సహజంగానే మైదానవూపాంతాల్లో, పట్టణాల్లో మొదట ప్రభావం చూపించింది. క్రమంగా అటవీ-ఆదివాసీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. తెలంగాణలో, ఆంధ్రలో విప్లవోద్యమం బలహీనపడడాన్ని మనం ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. అప్పటి వరకు భూస్వాముల తొత్తులు, విలాసాలకు అలవాటుపడిన కొందరు లంపెయిన్లు తప్ప నక్సలైట్ల గురించిన సమాచారమిచ్చేవారే దొరకని పరిస్థితి గ్రామాల్లో ఉండేది. ఏ పోరాటం మొదలుపెట్టినా ప్రజలు విస్తృతంగా పాల్గొనేవారు. అలాంటిచోట పోలీసులు ఊరూరా ఇన్ఫార్మర్లను తయారుచేసుకోగలిగారు. పార్టీ లోపలే కోవర్టులను ప్రవేశపెట్టగలిగారు. స్వార్థచింతన పెరిగిన మధ్యతరగతి, విద్యార్థి, ఉద్యోగ, మేధావి వర్గాలు నక్సలైట్లంటే సదభివూపాయం ఉన్నప్పటికీ ఉద్యమాన్ని పట్టించుకోవడం మానేశాయి.

సమస్య తమదైతే తప్ప ఎందుకు రిస్క్ ఎందుకు తీసుకోవాలన్న ధోరణిని కనబర్చాయి. ఈ సామాజిక మార్పును తమకు అనుకూలంగా మలుచుకున్న పోలీసు లు తమ ఎత్తుగడలు మార్చారు. త్రిముఖ వ్యూహాన్ని అనుసరించారు. దళాల వేటను తీవ్రస్థాయిలో కొనసాగిస్తూనే సానుభూతిపరులను, మిలిటెంట్లను అదివరకటిలా వేధించడం, భయపెట్టడం మానేసి బుజ్జగించే విధానాలను అనుసరించారు. లొంగిపోయిన వారికి విలాస జీవితాలను చవిచూపారు.

ఈ విధానాలు మంచి ఫలితాలనిచ్చి మైదాన ప్రాంతాల నుంచి మావోయిస్టులు తమ దళాలను, కార్యకలాపాలను ఉపసంహరించుకునేలా చేశాయి. దండకారణ్యం, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. అక్కడి అటవీ-ఆదివాసీ ప్రాంతాల్లో ‘బహుళజాతి’ అభివృద్ధి, పశ్చిమ సంస్కృతి చొరబడింది తక్కువ. ఇప్పటికీ అక్కడ వ్యక్తి కేంద్రంగా ఆలోచించే మనస్తత్వం ప్రజానీకానికి అలవడలేదు. మా ఊరు, మా తెగ, మా సమాజం అన్న భావన ఇంకా బలంగా ఉంది. పరిష్కరించాల్సిన సమస్యలూ బోలెడున్నాయి. శతాబ్దాలుగా వారిని పట్టించుకున్న నాథుడు లేడు.

ఆ ప్రాంతాల్లో పరిస్థితి వేరు..

వనరులను దోచడం తప్ప ప్రభుత్వాలు చేసిందేమీలేదు. అలాంటి సమయంలో మేమున్నామంటు వచ్చిన దాదాలు దేవుళ్లుగా మారారు. వారి దళాలు బెటాలియన్ల స్థాయికి ఎదిగాయి. ఊరూరా జనతన సర్కా ర్లు ఏర్పడి స్వయంపాలన సాగిస్తున్నాయి. దినదినం విప్లవోద్యమం మరింత బలపడుతోంది. రాహుల్ శర్మ ఎస్‌పీగా పనిచేస్తున్న దంతేవాడ జిల్లాలో పరిస్థితి ఇదే.రాయ్‌తో శర్మ చేసిన వ్యాఖ్యలను మనం ఈ నేపథ్యంలోనే చూడాలి. అటవీ-ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ఎత్తుగడలనే అవలంబిస్తున్నాయి.

ఓ వైపు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేబట్టి మరోవైపు అమాయక ఆదివాసులకు స్వార్థం నేర్పే పనిని యుద్ధవూపాతిపదికన నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి పథకాల పేరుతో ఊరూరా రోడ్లు వేస్తున్నారు. సంక్షేమ కార్యక్షికమాలంటూ కలర్ టీవీలు అమరుస్తున్నారు. ఉద్యోగాల కల్పన పేరుతో చదువుకున్న యువకులను పోలీసులుగా, హోంగార్డులుగా, ఎస్‌పీఓలుగా రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రజాసేవ ముసుగులో స్వచ్ఛంద సంస్థలను రప్పిస్తున్నా రు. మొన్నటి వరకూ బయటి ప్రపంచపు వాసనలు తెలియని అబూజ్‌మాడ్‌పైనా ఈ పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి.

విప్లవపార్టీల వెనకబాటు..

భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాల పరిస్థితి ప్రస్తుతం ఇలాగే వుంది. ప్రపంచీకరణ తదనంతర పరిణామాలను అర్థం చేసుకుని విశ్లేషించడంలో, అందుకు తగినట్లు వ్యూహం-ఎత్తుగడల్లో మార్పులు చేసుకోవడంలో విప్లవపార్టీలు వెనకబడుతున్నాయన్నది నిజం. ఆ పార్టీలు ఈ పరిణామాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచీకరణ సమాజంలో తెచ్చిన ఆర్థిక మార్పులను, ఉపరితల సంస్కృతిని అధ్యయనం చేసి తగిన విధానాలను రూపొందించాలి. అమెరికాతో సహా సామ్రాజ్యవాద దేశాల్లో సైతం రోజురోజుకు సంక్షోభం తీవ్రతరమవుతున్న తరుణంలో కాలం చెల్లిన పెట్టుబడిదారీ వ్యవస్థకు తామే ప్రత్యామ్నాయమన్న విషయా న్ని ఆచరణలో రుజువుచేయాలి. వినూత్న ఎత్తుగడలతో ఉద్యమాలకు నూతన జవసత్వాలు అందించాలి. స్వార్థమే మానవాళికి పరమార్థం కారాదని, ప్రజల కోసం పనిచేయడం హిమాలయాలకన్నా ఘనమన్న సూక్తి వెలుగులో సమాజాన్ని నడిపించాలి.

  • డి మార్కండేయ

Latest News