మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ నిర్ణయించింది. ఆయనకు డిప్యూటీలుగా ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉంటారు. ఈ మేరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ బుధవారం జరిగిన సమావేశంలో ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారం రేపు (గురువారం) జరుగుతుంది.