Thursday, September 18, 2025

తెలంగాణ(Telangana)లో మరోసారి (earthquake) భూకంపం? : NGRI ఏం చెప్తున్నది?

మరోకోణం డెస్క్: బుధవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం తెలంగాణను వణికించింది. ఏమైందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం ములుగు కేంద్రంగా సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపాయి. ఈ భూప్రకంపనలపై NGRI శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చేందుకు అవకాశం ఉందని  చెప్పారు. అయితే ఈ రోజు వచ్చిన ప్రకంపనలతో పోలిస్తే.. తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఎవరైనా పాత భవనాలు, పగుళ్లు పట్టిన ఇళ్లలో ఉంటే వెంటనే ఖాళీ చేయడం మంచిదని.. లేదంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

Latest News