జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రస్తుతం దిశ దినపత్రిక ఎడిటర్‌గా ఉన్నాను.
1998లో నేను డీకేలో ఉన్నప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తరఫున నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎకనమిక్ టైమ్స్ సీనియర్ ఎడిటర్ గుర్బీర్ సింగ్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ రిపోర్టర్ హేమంత్, రెడిఫ్ ఆన్ ద నెట్ వెబ్ పోర్టల్‌కు చెందిన చిందూ శ్రీధరన్, లోక్‌మత్ అనే మరాఠీ పేపర్ నుంచి రాహుల్ అవుసారే డీకేకు వచ్చారు. ఐదు రోజుల పాటు మా దళాలతో తిరిగారు. ఆ తర్వాత వాళ్లు రాసిన కథనాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 27 ఏళ్ల తర్వాత అప్పుడు వాళ్లు రాసిన కథనాల్లో రెండు దొరికాయి. ఆసక్తి ఉన్నవాళ్లు చదవడానికి ఇక్కడ పెడుతున్నాను.
ద వీక్‌లో వచ్చిన కథనం:
రెడిఫ్ ఆన్ ద నెట్‌లో వచ్చిన కథనం.