వెంటిలేటర్‌పై టీ-కాంగ్రెస్!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నియామక ప్రక్రియ ఈ వారం మరోమారు వార్తలలో నిలిచింది. రెండు మూడు రోజులలోనే కొత్త చీఫ్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్న సమాచారం మీడియాకు అందింది. యథాప్రకారం ఆ పదవిని ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ తదితర నేతలు ఢిల్లీ చేరారు. మరోవైపు ఫలానా నేతకు అవకాశమిస్తే బాగుండదని ఒకరు, నాకే ఇవ్వబోతున్నారని ఒకరు, బయట పార్టీ నుంచి వచ్చినవారికి ఎలా ఇస్తారంటూ ఒకరు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

స్మార్ట్‌ ఫోన్‌ను నమ్మకండి!

ఈటల ఎపిసోడ్‌పై మాట్లాడుదామని బాగా పరిచయం ఉన్న ఓ రాజకీయ నాయకుని నెంబరుకు నాలుగు రోజుల కిందట కాల్ చేసాను. అతను కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసాడు. అంతలోనే అతని నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ”ఈ మధ్య అందరి ఫోన్లూ ట్యాప్ అవుతున్నాయట. ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. వాట్సాప్ అయితేనే కొంతలో కొంత సేఫ్” అంటూ సంభాషణ స్టార్ట్ చేసాడు. అతనే కాదు.. చాలా మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ప్రజాసంఘాల…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More

పల్లెకు పోదాం చలో చలో..

మూడు రోజుల కిందట మా ఆఫీసు కొలీగ్స్ మధ్య ఓ చర్చ జరిగింది. ” సెకండ్ వేవ్ ఇంకా పోనే లేదు. థర్డ్ వేవ్ అంటున్నరు. మధ్యలో ఈ రంగు రంగుల ఫంగస్ గొడవ ఒకటి. అది కూడా మహమ్మారిలా మారి లక్షల మందిని చంపవచ్చునన్న వార్త ఇంకొకటి. ఇట్లైతే ఇంక బతుకుడెట్ల” అన్నది ఆ చర్చ సారాంశం. ”ఈ సిటీల ఇట్ల ఉండుడు కంటే మన సొంతూళ్లకు వెళ్లిపోయి, ఓ ఏడాది గ్రాసం సమకూర్చుకుని బయటకు…

Read More

థర్డ్ వేవ్‌కు సిద్ధమేనా?

సెకండ్ వేవ్ కరోనా కేసులతో దేశం విలవిలలాడుతున్నది. ఫస్ట్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో సెకండ్ వేవ్ తలుపులు తట్టింది. మహారాష్ట్రలో మొదలై రాజధాని ఢిల్లీని చుట్టుముట్టి అతివేగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. ఫస్ట్ వేవ్ కొనసాగిన సంవత్సర కాలంలో(2020 మార్చ్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 9 వరకు) దేశవ్యాప్తంగా కోటి ఎనిమిది లక్షల పైచిలుకు కేసులు, లక్షా 55 వేలకు పైగా మరణాలు నమోదు కాగా,…

Read More

కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…

Read More

ఉద్యమాలకు, రాజకీయాలకు సంబంధం లేదా?

ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యమబంధాలు లేవని, కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయని అన్నారు. 2014 వరకే ఉద్యమమని, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని వివరించారు. స్వయానా సీఎం కేసీఆర్ కూడా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా నొక్కి చెప్పారు. గొప్ప ఉద్యమం చేసిన టీఆర్ఎస్ తన ప్రత్యేక…

Read More

ఇది ఇండియా.. రూల్స్ వర్తించవు

డిగ్రీ చదివే రోజులలో మా రూమ్మేట్ ఒకడుండేవాడు. ఏదైనా పద్ధతిని పాటించే విషయంలో చర్చ వచ్చినప్పడల్లా ‘ఇది ఇండియా.. ఇక్కడ రూల్స్ గీల్స్ నై చల్తా’అనేవాడు. అదేంటని అడిగితే ‘ఇక్కడ రూల్స్‌ తోపాటే వాటిని బ్రేక్ చేసే మార్గాలు కూడా తయారవుతాయి. అందుకే ఎవరూ పాటించరు’అనేవాడు. అందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు చూపించేవాడు. ఎవరు ఎంత వాదించినా చివరకు ప్రతిసారీ అతనే గెలిచేవాడు. సుమారు ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కరోనా కాలంలో ఆయన మాటలు ఎంతటి అక్షరసత్యాలోనని…

Read More

ఓటుకు నోటా.. నోటుకు ఓటా?

ఓటుకు నోటు కేసు గురించి వినని తెలుగువారుండరు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థికి ఓటు వేయడం కోసం టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 2015లో జరిగిన ఈ ఘటనపై నమోదైన కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవలే నిందితులపై అభియోగాలను నమోదు చేసిన ఏసీబీ కోర్టు త్వరలో సాక్షులను విచారించనుంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 171(బీ) ప్రకారం ఓటు…

Read More

పౌరుల ఇంటర్‌నెట్‌పై కన్నేసిన ప్రభుత్వం..

పౌరుల ఇంటర్ నెట్ కార్యకలాపాలపై సర్కారు కన్నుపడింది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే నెపంతో ఆది త్వరలో మెయిళ్లపై, బ్లాగులపై, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై, నెట్ ద్వారా జరిపే సంభాషణలపై అస్త్రం సంధించబోతోంది. ఈ మాధ్యమం ద్వారా వెళ్లే టెక్స్ట్ మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలను ఇకనుంచి నిఘా సంస్థలు కనిపెట్టి ఉంచుతాయి. నేత్ర పేరుతో అమలయ్యే ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేబినెట్ సెక్రెటేరియట్లు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఓకే చెప్పాయి….

Read More