ఎంఐఎం.. బీజేపీకి బీ టీమ్?
వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆ మధ్యన ప్రకటించారు. భాగీదారీ సంకల్ప్ మోర్చాతో ఈ మేరకు ఎన్నికల ఒప్పందం కుదిరిందని, మరే పార్టీతోనూ పొత్తు ఉండబోదని ప్రకటించారు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార పీఠాన్ని ప్రభావితం చేయగలిగే సంఖ్యలో సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. ఏళ్లుగా కేవలం తెలంగాణ, అదీ హైదరాబాద్…
