మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా తెలంగాణ.. నిఘా వర్గాల హై అలర్ట్!

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….

Read More

తెలంగాణలోనే మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ? పోలీసులు ఏం చెబుతున్నారు?

మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్‌జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు…

Read More

మధ్యభారతంలో ఒకేఒక్కడు.. అందరి కళ్లూ మావోయిస్దు నేత దేవ్‌జీ పైనే!

ఒడిషాలోని కందమాల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్@పాక హన్మంతు మరణించాడు. గణేశ్ మృతితో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రకమిటీలో ప్రస్తుతం ఐదుగురే మిగిలారు. గణపతి@ముప్పాళ లక్ష్మణ్‌రావు, సంగ్రామ్@మల్లా రాజిరెడ్డి, దేవ్‌జీ@తిప్పిరి తిరుపతి తెలంగాణ వాళ్లు కాగా, సాగర్@మిసిర్ బెస్రా, ఆనల్ దా@పతీరాం మాంఝీ బిహార్, జార్ఖండ్‌కు చెందిన వాళ్లు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కార్యదర్శి బసవరాజు@నంబళ్ల కేశవరావు, మిలిటరీ చీఫ్ హిడ్మా సహా…

Read More

మల్లోజుల, ఆశన్న ఆధ్వర్యంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ.. ఏర్పడేది అప్పుడే!

మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నది. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పని చేయనున్నది. ఒక జాతీయ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్‌లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళతారా? అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ‘‘ప్రజల కోసం…

Read More

ఆపరేషన్ కగార్.. మావోయిస్టు పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే!

ఆపరేషన్ కగార్‌ను అంచనా వేయడంలో జరిగిన ఘోర తప్పిదం మూలంగానే మావోయిస్టు పార్టీ.. చరిత్రలోనే కనీ వినీ ఎరుగని నష్టాలను చవిచూసిందా? ఆ పార్టీ కార్యదర్శి బసవరాజ్ సహా పలువురు సీసీ, ఎస్‌జెడ్సీ, డీవీసీ సభ్యులు, హిడ్మా సహా పీఎల్జీఏ బెటాలియన్, కంపెనీ, ప్లాటూన్ల కమాండర్లు, కీలక సభ్యులు చనిపోవడానికి పొలిట్‌బ్యూరో తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమా? 2024 ఆగస్టులో విడుదల చేసిన సర్క్యులర్‌లో పార్టీ శ్రేణులకు, గెరిల్లా బలగాలకు సరైన వ్యూహం-ఎత్తుగడలను కనుక సూచించి ఉంటే…

Read More
Marokonam

తాజా వార్తలు.. ఎప్పటికప్పుడు.. (పగలు 2.30 గం. సోమవారం, 31 డిసెంబర్ 2024)

TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా.. 4 గంటలకల్లా తేలిపోనున్న కేటీఆర్ ఫ్యూచర్ INTER STUDENTS: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి ఉచిత భోజనం NEW YEAR ALERT: కొత్త సంవత్సరం వేడుకలను..ఇంట్లోనే జరుకోండి : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ CM CHANDRABABU: గత ప్రభుత్వ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు: ఏపీ సీఎం చంద్రబాబు నాకు హైకమాండ్ ఎవరు లేరు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు పేదరికం…

Read More

‘అంతరంగ’ మథనం – అన్నవరం దేవేందర్ పుస్తక సమీక్ష

సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా, నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి. ఒక ఆర్టికల్‌కి మరొక ఆర్టికల్‌కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండును ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టిన పిండి. తెలంగాణ మట్టి వాసన మరువని, మూలాలను వదులుకోని, పదవులకు అమ్ముడుపోని హృదయాంతరంగాన్ని స్వచ్ఛంగా తనలో నిలుపుకున్నారు కాబట్టే స్వేచ్ఛగా, నిర్భీతిగా, సహజాతి సహజంగా…

Read More
25.12.2022-Marokonam

వారి త్యాగాలను గౌరవిద్దాం!

‘విప్లవ మేధావి, మావోయిస్టు నేత ఎల్ఎస్ఎన్ మూర్తి క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ గత బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. యాభై సంవత్సరాలకు పైగా పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఆయనకు సొంత కుటుంబం కానీ, ఆస్తి కానీ లేవు. కొంతమంది దాతల సాయంతో నగర శివారులోని సీఆర్ ఫౌండేషన్‌లో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందారు.’ ‘సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన యాభై ఐదేళ్ల ఆలూరి ఉష క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవలే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ముప్పై ఏళ్ల తర్వాత జనజీవన…

Read More

షర్మిల ఎవరు వదిలిన బాణం..?

తెలంగాణలో ఇప్పుడు వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలలోని వ్యక్తిగా నిలిచారు. తన ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తూ వివాదానికి కారణమయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆమె యాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై, కేసీఆర్ కుటుంబంపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతీకారానికి పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగగా, పోలీసులు రంగంలోకి…

Read More