మోడీ వాంట్స్ తెలంగాణ!
తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…
