మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా తెలంగాణ.. నిఘా వర్గాల హై అలర్ట్!

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….

Read More

ఆన్‌లైన్ పేపర్లను గుర్తించండి..

పదేళ్ల కిందట మీరు బస్సులో ప్రయాణించినపుడు సీటుకో పేపర్ కనిపించేది. ఒకరు ఈనాడు, ఒకరు ఆంధ్రజ్యోతి. మరొకరు సాక్షి. ఇంకొకరు నమస్తే తెలంగాణ చదువుతూ కనిపించేవాళ్లు. ఒక పేపర్ చదవడం పూర్తయినవాళ్లు పక్క సీట్లో వారిని ఇంకో పేపర్ అడుక్కుని చదవడం కూడా చూసే వుంటారు. బస్సేమిటి, బస్టాండ్లలో, రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, విమానాలలో, విమానాశ్రయాలలో, రోడ్ సైడ్ హోటళ్లలో, బార్బర్‌ షాపుల్లో, ఆఫీసుల్లో ఇలా ఎక్కడ చూసినా పేపర్లు చదివే జనం తటస్థపడేవారు. వీధి వీధినా…

Read More

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్-1 సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా ఉన్న పండోరా గ్రహంపై కన్నేసిన మానవుల కథ అది. ఆ గ్రహంపై నవీ అనే పేరున్న భారీ విచివూత శరీరాకృతి కలిగిన మూలవాసులు నివసిస్తారు. వీళ్లు ప్రకృతి ప్రేమికులు. అడవిపై ఆధారపడి జీవిస్తారు. కొండదేవతను ఆరాధిస్తారు. ఆ దేవత కొలువైన పర్వతక్షిశేణుల్లో ఖనిజనిల్వలున్నట్లు గుర్తించిన మానవులు వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. నవీలను పోలిన మానవ…

Read More

పౌరులపై ‘సాయుధ’ చట్టం ?!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై…

Read More

మునుగోడులో బీజేపీ ఓడింది.. మోడీ-షా గెలిచారు!

మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ తమ బలగాలను భారీగా మోహరించాయి. అర్థ, అంగ బలాలను విచ్ఛలవిడిగా వినియోగించాయి. ఓటుకు రూ. 3నుంచి 5వేల వరకు వెచ్చించాయి. టీఆర్ఎస్ వంద మంది వరకు మంత్రులు,…

Read More

జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్,…

Read More

ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ) ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత…

Read More

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంవూదసింగ్ గత బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆయన పేరు కెప్టెన్ రఘురామన్. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్‌క్షిగిడ్)కు సీఈఓ. నెలకు రూ. 10 లక్షల జీతం. సకల సౌకర్యాలు, ఇతర భత్యాలు అదనం. ప్రైవేట్ కార్పొరేట్లకు సేవలందించి ప్రతిఫలం పొందే స్వేచ్ఛనూ ఆయనకు ప్రభుత్వం కల్పించింది. అయితే ఇక్కడ విషయం అది…

Read More

ప్రభాకర్‌రావుకు మరో వారం పాటు కస్టడీ పొడిగింపు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అనుమానితుడు, ప్రస్తుతం తెలంగాణ పోలీసుల కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావు కస్టడీని సుప్రీంకోరుట్ ఈ మధ్యాహ్నం మరో వారం పాటు పొడిగించింది. తమ విచారణకు ఆయన సహకరించడం లేదని, నోరు విప్పడం లేదని పోలీసులు సమర్పించిన కస్టోడియల్ రిపోర్టుకు పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును మరింత వేగంగా, ఎఫెక్టివ్ గా విచారించడానికి నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సజ్జనార్…

Read More

అబ్ కీ బార్ ఆప్ కా!?

పంజాబ్ ఎన్నికలలో ఘనవిజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయస్థాయి వార్తలలో నిలిచింది. తొమ్మిదేళ్ల కిందట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ పార్టీ ప్రయాణం మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఒక కొలిక్కి వచ్చింది. గోవాలో కూడా రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా, పంజాబ్‌ రాష్ట్రాన్ని ఊడ్చేసిన తీరు రాజకీయ విశ్లేషకులలో తీవ్ర చర్చను రేపింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండేళ్లుగా మోడీ సర్కారుపై రాజీలేని పోరాటం చేసిన పంజాబ్ రైతులు తమకు మద్దతిచ్చిన…

Read More