దిశ ఎడిటర్ మార్కండేయపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడి.. ఆయన జవాబు..
మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. నేను పార్టీలోకి వెళ్లిందీ, తిరిగివచ్చిందీ ఏ పరిస్థితుల్లో అనే వివరాలు నేను రాసిన సంపాదకీయాల(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చాయి.) సంపుటి మలుపు పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ’’మరోకోణం‘‘ అనే పుస్తకంలో…
