మరోకోణం : మావోయిస్టుల ఓటమి.. సైనిక విశ్లేషణ
మావోయిస్టులు పరాజయం పొందడం వెనకాల ఉన్న ప్రధాన కారణాలను గత వారం రాశాను. ఈ వారం ఆ ఓటమిని సైనికంగా విశ్లేషిస్తాను. గత వారం పొందిన అనుభవం దృష్ట్యా.. ఈ సైనిక సమీక్ష రాయడానికి నాకున్న అర్హతలను పాఠకులకు చెప్పడం బాధ్యతగా భావిస్తాను. పూర్తికాలం కార్యకర్తగా 1983లో పార్టీలో చేరి 1988 నుంచి మిలిటరీ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నాను. ఆ సంవత్సరమే ప్రారంభమైన ‘‘జంగ్’’ మిలిటరీ పత్రికలో పనిచేశాను. 1989 మిలిటరీ క్యాంపులో శిక్షణ పొందిన అనంతరం…
