హుజూరాబాద్‌లో చివరకు నోటుదే విజయమా?
హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు తమ యుద్ధ మోహరింపులను పూర్తి చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో దిగగా, అధికార పార్టీ తరఫున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. మరో 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా అందరి దృష్టీ రెండు పార్టీల పైనే ఉంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా…
