కేటీఆర్ టైం వచ్చేసింది!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకొని రాజధాని వరకు ఆ పార్టీ శ్రేణులలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ముందు కినుక వహించిన నేతలు కూడా చివరకు ప్రమాణస్వీకారానికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణ తల్లి సోనియమ్మేనంటూ రేవంత్ చేసిన ప్రసంగం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఒకరకంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదిన సంకేతాలు…

Read More

రేవంత్ చికిత్స ఫలించేనా!

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. అంతర్గత కుమ్ములాటలతో అధ్వానస్థితికి చేరిన రాష్ట్ర యూనిట్‌కు సారథ్యం వహించే బాధ్యతను ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అందరూ ఊహించిన విధంగానే పలువురు సీనియర్ నేతలు ఈ నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. గాంధీభవన్ మెట్లెక్కనని ఒకరు.. రాజీనామా చేస్తున్నానని మరొకరు.. కాంగ్రెస్ ఇక టీటీడీపీగా మారుతుందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రెండున్నరేళ్ల పాటు నిర్ణయాన్ని నాన్చిన హైకమాండ్…

Read More

వెంటిలేటర్‌పై టీ-కాంగ్రెస్!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నియామక ప్రక్రియ ఈ వారం మరోమారు వార్తలలో నిలిచింది. రెండు మూడు రోజులలోనే కొత్త చీఫ్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్న సమాచారం మీడియాకు అందింది. యథాప్రకారం ఆ పదవిని ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ తదితర నేతలు ఢిల్లీ చేరారు. మరోవైపు ఫలానా నేతకు అవకాశమిస్తే బాగుండదని ఒకరు, నాకే ఇవ్వబోతున్నారని ఒకరు, బయట పార్టీ నుంచి వచ్చినవారికి ఎలా ఇస్తారంటూ ఒకరు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More

కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…

Read More

ఉద్యమాలకు, రాజకీయాలకు సంబంధం లేదా?

ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యమబంధాలు లేవని, కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయని అన్నారు. 2014 వరకే ఉద్యమమని, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని వివరించారు. స్వయానా సీఎం కేసీఆర్ కూడా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా నొక్కి చెప్పారు. గొప్ప ఉద్యమం చేసిన టీఆర్ఎస్ తన ప్రత్యేక…

Read More

ఓటుకు నోటా.. నోటుకు ఓటా?

ఓటుకు నోటు కేసు గురించి వినని తెలుగువారుండరు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థికి ఓటు వేయడం కోసం టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 2015లో జరిగిన ఈ ఘటనపై నమోదైన కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవలే నిందితులపై అభియోగాలను నమోదు చేసిన ఏసీబీ కోర్టు త్వరలో సాక్షులను విచారించనుంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 171(బీ) ప్రకారం ఓటు…

Read More

నక్సల్స్ ఓటు బ్యాంకు ఎటువైపు?

రాష్ట్రం లో ఎన్నికల వాతావ రణం వేడెక్కింది. అన్ని పార్టీ లూ తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, దళిత, బలహీన, మైనారిటీ వర్గాల్లో పట్టు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుండగా, వైఎస్ సర్కారు అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తుల సమీకరణ తమను తప్పక విజయ పథాన నడిపిస్తుందని తెలుగు దేశం భావిస్తోంది. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గమంటూ పార్టీ స్థాపించిన…

Read More