ముందస్తా? పుత్రాభిషేకమా?

తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రధానిని, ప్రభుత్వ పాలనను, బీజేపీని ‘తిట్టిన తిట్టు తిట్టకుండా’రెండున్నర గంటల పాటు తిట్టిపోశారు. వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరుపై రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి…

Read More

మోడీ.. కేసీఆర్.. ఇచ్చుకో.. పుచ్చుకో!?

గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి, పెప్పర్ స్ర్పేలు కొట్టి ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని సానుభూతిని వ్యక్తం చేశారు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసివుండచ్చునని అన్నారు. రాష్ట్రపతి…

Read More

కేసీఆర్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక శీర్షికల్లో నిలవడం కేసీఆర్‌కు అలవాటే అయినప్పటికీ, మొన్నటి పత్రికా సమావేశం మరింత స్పెషల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కేసీఆర్.. మోడీని, ఆయన నేతృత్వంలో నడుస్తున్న సర్కారును, బీజేపీని, ఆ పార్టీ…

Read More

ఓటర్లా..? బిచ్చగాళ్లా..?

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా అనేక మంది అధికార పార్టీ నేతలు తరచూ ప్రకటిస్తుంటారు. ఆ పథకాలపై విపక్షాల, ప్రజాసంఘాల విమర్శలు ఎలా ఉన్నా ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని సంక్షేమ పథకాలు, కేటాయిస్తున్నన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదనేది కఠోర వాస్తవం. 2021 నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్…

Read More

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు,…

Read More

టి-కాంగ్రెస్ కథ కంచికేనా!

ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడుతుందని, దినదినం పుంజుకుంటున్న కమలనాథులను వెనక్కి నెట్టేసి టీఆర్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతుందని చాలా మంది ఆశించారు. ఆయన అధ్యక్షుడైన కొత్తలో రాజకీయ వాతావరణం అలాగే కనిపించింది. ప్రతి నిత్యం రేవంత్ ఇంటికి వేలాది మంది చేరుకోవడం, కాబోయే సీఎం అంటూ నినదించడం, కాస్త లేట్‌గా అయినా సీనియర్లు దారికి రావడం, తామంతా కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తామని ప్రకటించడం.. పార్టీ శ్రేణుల్లో…

Read More

కమలనాథులా? కాంగ్రెస్సా?

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్ మీట్లలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం పైనా, కమలనాథుల పైనా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఖబడ్దార్ బీజేపీ.. దేశంలో అగ్గి పెడతం.. వెంటాడుతాం.. వేటాడుతాం.. మెడలు వంచుడు కాదు.. నీ మెడలు విరుస్తాం…

Read More

కేసీఆర్ సార్.. మీరు మారాలి!

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రతిష్టకు అవమానకర భంగపాటు అని, ఇక రాష్ట్రంలో కమలనాథులదే…

Read More

కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

హుజూరాబాద్‌లో నోటుకు ఓటు విప్లవం!

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలుస్తారో ఎల్లుండికల్లా తేలిపోనుంది. ఈటల రాజేందర్ గెలుస్తారా లేక టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్ గెలుస్తారా? ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం కాని నోటుదే విజయమన్న విషయం మాత్రం రుజువైపోయింది. ఈ ఇద్దరు అభ్యర్థులూ విచ్ఛలవిడిగా ఓట్ల కోసం నోట్లు పంపిణీ చేశారు. అధికార పార్టీ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టివుండవచ్చు గాక, బీజేపీ సైతం వెనకపడలేదు. ఉన్నంతలో డబ్బులు పంచింది. ఆ…

Read More