ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపాత్రునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణం పూర్తయిన వెంటనే ఆయన చేసిన తొలి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పేదల ఆకాంక్షలను ధనికుల సిద్ధాంతాలు పరిష్కరించలేవంటూ ఆయన చెప్పిన నీతి వాక్యాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఆధునిక దేశ నిర్మాణంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఆర్థిక సమానత్వమని, పేదరికమనేది భారత నిఘంటువులో ఉండాల్సిన పదం కాదని, ఆకలి కంటే…

Read More

అబూజ్‌మాడ్‌పై దాడి-3: మావోయిస్టుల ఎత్తుగడలు ఇవేనా?

(డి మార్కండేయ) అబూజ్మడ్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్ట బెట్టేందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం దాడికి సన్నాహాలు చేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో ఆరోపించింది. మాడ్ కొండలు మావోయిస్టులకు సైనిక, రాజకీయ శిక్షణ కేంద్రంగా మారాయన్నది కేవలం సాకు మాత్రమేనని తెలిపింది. వామపక్ష తీవ్రవాదుల నిర్మూలన పేరుతో ప్రాచీన గిరిజన తెగలలో ఒకటైన మాడియా గోండుల జీవన విధానాన్నీ, సంస్కృతీ సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయబూనుకుంటున్నారని ఆరోపించింది. ఈ కుట్రను బహిర్గత…

Read More

మధ్యభారతంలో ఒకేఒక్కడు.. అందరి కళ్లూ మావోయిస్దు నేత దేవ్‌జీ పైనే!

ఒడిషాలోని కందమాల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్@పాక హన్మంతు మరణించాడు. గణేశ్ మృతితో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రకమిటీలో ప్రస్తుతం ఐదుగురే మిగిలారు. గణపతి@ముప్పాళ లక్ష్మణ్‌రావు, సంగ్రామ్@మల్లా రాజిరెడ్డి, దేవ్‌జీ@తిప్పిరి తిరుపతి తెలంగాణ వాళ్లు కాగా, సాగర్@మిసిర్ బెస్రా, ఆనల్ దా@పతీరాం మాంఝీ బిహార్, జార్ఖండ్‌కు చెందిన వాళ్లు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కార్యదర్శి బసవరాజు@నంబళ్ల కేశవరావు, మిలిటరీ చీఫ్ హిడ్మా సహా…

Read More

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు,…

Read More

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ సంస్థ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్నది. పర్యావరణ చట్టాలను తాము ఉల్లంఘించలేదని, తమ మైనింగ్ అనుమతులను రద్దు చేస్తే ఆ ప్రాంత ఆదివాసుల అభివృద్ధి కుంటువడుతుందని వేదాంత తన పిటిషన్‌లో పేర్కొన్నది. బాక్సైట్ సరఫరా లేకపోతే లాంజిగఢ్‌లో తాము నెలకొల్పిన అల్యూమినియం శుద్ధి…

Read More

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రిటి ష్ వాళ్లు ప్రవేశపెట్టిన పాత చట్టంలోని లొసుగులను సవరించే ఉద్దేశంతో తెస్తున్న ఈ నూతన చట్టం సైతం లోపభూయిష్టంగా, ప్రజావ్యతిరేకంగా ఉందన్న విమర్శలు వెల్లు ముఖ్యంగా ప్రజావూపయోజనాలను నిర్వచించే విషయంలో బ్రిటిష్ చట్టాన్నే అనుసరించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 7న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేశ్ ఈ ప్రతిపాదిత బిల్లును…

Read More

ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు….

Read More

కేటీఆర్ టైం వచ్చేసింది!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకొని రాజధాని వరకు ఆ పార్టీ శ్రేణులలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ముందు కినుక వహించిన నేతలు కూడా చివరకు ప్రమాణస్వీకారానికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణ తల్లి సోనియమ్మేనంటూ రేవంత్ చేసిన ప్రసంగం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఒకరకంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదిన సంకేతాలు…

Read More

నిరుద్యోగుల ఓటు ఎటువైపు?

ఢిల్లీలో ఇటీవల టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఒక నివేదిక సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను ఇందులో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని తాము చేసిన విస్తృత సర్వే వివరాలను తెలియపరచారు. ఈ సర్వే వివరాలను గోప్యంగా ఉంచినా, అందులో పాల్గొన్న ఓ నాయకుడి సమాచారం మేరకు టీఆర్ఎస్‌కు 38 శాతానికి తగ్గకుండా…

Read More

అక్కడ పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ!

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ కాకుండా 15మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా, ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకూ ఉంది. చివరకు బరిలో ఎంతమంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే…

Read More