మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?
(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి…
