చింతలు తీర్చని చింతన్ శిబిర్!
కష్టాల కడలిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలను వెతకడానికి ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ నిర్వహించింది. నాయకత్వపరంగా, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధోమథనం జరిపింది. చివరిరోజు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పార్టీ పునరుజ్జీవం కోసం పైనుంచి కింది స్థాయి వరకు సంస్థాగత సంస్కరణలు చేపట్టడానికి ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రాజకీయ వ్యవహారాలపై…
