మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు టీఆర్ఎస్ వెనకాల చేరడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. వారి ఓటు బ్యాంకు కారు గుర్తుకు మళ్లడంతోనే పదివేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిని ఓడించడం సాధ్యమైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘వికసించిన ఎర్ర గులాబీ.. కారును గట్టెక్కించిన కామ్రేడ్లు’ అంటూ మీడియా…
మునుగోడులో బీజేపీ ఓడింది.. మోడీ-షా గెలిచారు!
మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార…
మునుగోడు బైపోల్.. క్యా సీన్ హై..!
మునుగోడులో ఏం జరగనుందనే విషయం పైనే ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. అక్కడి పరిస్థితి టీఆర్ఎస్, బీజేపీ మధ్యలో నువ్వా? నేనా? అన్నట్టు ఉందని అంటున్నారు. మూడవ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్, బహుజన వాద బీఎస్పీ ఎవరి ఓట్లను ఎక్కువ చీల్చితే ఆ పార్టీ…
మోడీకి ప్రత్యామ్నాయం లేదా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే రెండు దఫాలుగా పాలన సాగించిన ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన అనేక విమర్శలున్నా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలినా 2019 మే తర్వాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు…
దృష్టి మళ్లింపు వ్యూహంలో భాగమే బీఆర్ఎస్!
కేసీఆర్ కొత్త పార్టీపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. దేశ్ కీ నేతా కేసీఆర్.. అంటూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆయన పార్టీ చేసేదేముండదని కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు విమర్శించాయి. ఇప్పటికే అధికార పార్టీ…
లౌకికవాదులు కేసీఆర్ వెనకే చేరాలా?
మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక…
ప్రభుత్వ ఉద్యోగులు పని చేయరా?
ప్రభుత్వ వైద్యులను జియో టాగింగ్ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన రాష్ట్రంలో దుమారం రేపుతున్నది. తామేమీ జంతువులం కాదని, అనుక్షణం తాము ఎక్కడున్నామో తెలుసుకోవడం అవసరం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఉద్యోగులలో పని ఎగవేసేవాళ్లు, డుమ్మా కొట్టేవాళ్లు, ఇతర…
టెంట్ or ఫ్రంట్? కేసీఆర్ జాతీయ ఎత్తుగడ ఏంటి?
కేసీఆర్ జాతీయ పార్టీ గురించిన చర్చ మరోమారు ఊపందుకుంది. దసరా రోజే కొత్త పార్టీకి అంకురార్పణ జరుగుతుందని గులాబీ బాస్ చెప్పినట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 11న హైదరాబాదుకు వచ్చిన ఆయన కేసీఆర్‌తో భేటీ అయి…
రాహుల్‌జీ.. ముందు పార్టీని చక్కదిద్దండి !
నెహ్రూ కుటుంబ వారసుడు, కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సారథ్యంలో గత బుధవారం ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభమైంది. కుల, మత, ప్రాంత, భాష, ఆహార, ఆహార్య విచక్షణ లేకుండా భారతావనిని ఏకం చేయడమే ఈ యాత్ర లక్ష్యం. కన్యాకుమారిలో మొదలై 12 రాష్ట్రాల…
పాత్రికేయ ప్రస్థానం@20: అక్షరం ఆగదు… దిశ మారదు…
వినాయక చవితి పండుగ రోజు. సంస్థకు సెలవు ప్రకటించినప్పటికీ స్వచ్ఛందంగా పనిచేస్తామన్న డజను మంది స్టాఫ్‌తో స్పెషల్ ఎడిషన్ తెద్దామనే ప్రయత్నంలో సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఏడు గంటల సమయంలో మిత్రుడు గోపాల్ కాల్ చేశాడు. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూలు ఫస్ట్ బ్యాచ్ గెట్…
