రేవంత్ చికిత్స ఫలించేనా!
ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. అంతర్గత కుమ్ములాటలతో అధ్వానస్థితికి చేరిన రాష్ట్ర యూనిట్‌కు సారథ్యం వహించే బాధ్యతను ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అందరూ ఊహించిన విధంగానే పలువురు సీనియర్ నేతలు ఈ నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. గాంధీభవన్ మెట్లెక్కనని ఒకరు.. రాజీనామా చేస్తున్నానని మరొకరు.. కాంగ్రెస్ ఇక టీటీడీపీగా మారుతుందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రెండున్నరేళ్ల పాటు నిర్ణయాన్ని నాన్చిన హైకమాండ్…
