Marokonam Markandeya

మరోకోణం : మావోయిస్టుల ఓటమి.. సైనిక విశ్లేషణ

మావోయిస్టులు పరాజయం పొందడం వెనకాల ఉన్న ప్రధాన కారణాలను గత వారం రాశాను. ఈ వారం ఆ ఓటమిని సైనికంగా విశ్లేషిస్తాను. గత వారం పొందిన అనుభవం దృష్ట్యా.. ఈ సైనిక సమీక్ష రాయడానికి నాకున్న అర్హతలను పాఠకులకు చెప్పడం బాధ్యతగా భావిస్తాను. పూర్తికాలం కార్యకర్తగా 1983లో పార్టీలో చేరి 1988 నుంచి మిలిటరీ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నాను. ఆ సంవత్సరమే ప్రారంభమైన ‘‘జంగ్’’ మిలిటరీ పత్రికలో పనిచేశాను. 1989 మిలిటరీ క్యాంపులో శిక్షణ పొందిన అనంతరం…

Read More
Marokonam Analysis

మరోకోణం: మావోయిస్టుల ఓటమి.. రాజకీయ విశ్లేషణ

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాజకీయంగా, సైనికంగా పొందిన ఓటమి గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు, సిద్ధాంతీకరణలు కొనసాగుతున్నాయి. ఈ దెబ్బతో భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా నడుస్తున్న మావోయిస్టు ఉద్యమాల చరిత్ర ఇక అంతమైనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో విప్లవోద్యమాలను ఆశించడం ఎండమావి లాంటిదేనంటున్నారు. ఒకప్పుడు మనిషి జీవితం సమాజం చుట్టూతా తిరిగితే ఇప్పటి తరం తన చుట్టూ తానే అల్లుకుని బతుకుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తను బాగుంటే చాలని, చుట్టుపక్కల మనుషులు…

Read More

జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్,…

Read More

తెలంగాణ(Telangana)లో మరోసారి (earthquake) భూకంపం? : NGRI ఏం చెప్తున్నది?

మరోకోణం డెస్క్: బుధవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం తెలంగాణను వణికించింది. ఏమైందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం ములుగు కేంద్రంగా సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపాయి. ఈ భూప్రకంపనలపై NGRI శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చేందుకు…

Read More

నిజాం కాలం నాటి ప్రముఖ విమానాశ్రయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా….?

నిజాం కాలంలో తెలంగాణలో నిర్మించిన కట్టడాలు, గుళ్లు, ప్రసిద్ధి స్థలాలు, కోటలు… ఇలా చెబుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, కుష్ మహల్, భద్రకాళి దేవాలయం ఇలా చాలానే ఉన్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన…

Read More

పౌరుల ఇంటర్‌నెట్‌పై కన్నేసిన ప్రభుత్వం..

పౌరుల ఇంటర్ నెట్ కార్యకలాపాలపై సర్కారు కన్నుపడింది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే నెపంతో ఆది త్వరలో మెయిళ్లపై, బ్లాగులపై, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై, నెట్ ద్వారా జరిపే సంభాషణలపై అస్త్రం సంధించబోతోంది. ఈ మాధ్యమం ద్వారా వెళ్లే టెక్స్ట్ మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలను ఇకనుంచి నిఘా సంస్థలు కనిపెట్టి ఉంచుతాయి. నేత్ర పేరుతో అమలయ్యే ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేబినెట్ సెక్రెటేరియట్లు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఓకే చెప్పాయి….

Read More

ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ) ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత…

Read More

అన్నల రాజ్యం-6: మావోయిస్టు ప్రాంతాలపై త్వరలో భారీ దాడి?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) బస్తర్‌లో రాజ్యమేలుతున్న జనతన సర్కార్లను, మావోయిస్టు గెరిల్లాల ప్రాబల్యాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచ్చలవిడిగా హింసకు పాల్పడడం, హెలికాఫ్టర్లపై సైతం తెగబడడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తే తప్ప దేశాభివృద్ధి సాధ్యం కాదని, మధ్యభారతంలో వివిధ బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలు అమలు చేయడం కుదరదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదేపదే ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. దండకారణ్యం, ఆంధ్రా-ఒరిస్సా, జార్ఖండ్-బెంగాల్,…

Read More

అన్నల రాజ్యం-5: ఇళ్ల దహనాలు ఇక్కడ కామన్..

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలీ రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే బలగాలను దించి భయపెట్టే, బలప్రయోగం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు….

Read More

అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది. అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే….

Read More