నిరుద్యోగుల ఓటు ఎటువైపు?
ఢిల్లీలో ఇటీవల టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఒక నివేదిక సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను ఇందులో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని తాము చేసిన విస్తృత సర్వే వివరాలను తెలియపరచారు. ఈ సర్వే వివరాలను గోప్యంగా ఉంచినా, అందులో పాల్గొన్న ఓ నాయకుడి సమాచారం మేరకు టీఆర్ఎస్‌కు 38 శాతానికి తగ్గకుండా…
కేసీఆర్‌లో ఓటమి భయం మొదలైందా?
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బిహార్‌కు చెందిన పీకే తనవైన వ్యూహాలతో 2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని మోడీని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి మొదటిసారి వార్తల్లో నిలిచారు….
నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..
నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిన భారత్ రూరల్ లైవ్‌లీహుడ్ ఫౌండేషన్ (బీఆర్‌ఎల్‌ఎఫ్) ఇందుకు ఉద్దేశించినదే. దేశంలోని 170 గిరిజన జిల్లాల అభివృద్ధిలో పౌర సమాజం భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ సంస్థను ఏర్పాటుచేస్తున్నట్ల్లు ఆయన పేర్కొన్నారు. నక్సల్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నవి ఆదివాసీ ప్రాంతాలేనని గుర్తించిన ప్రభుత్వం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ చొరవతో ఈ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది….
ఇది ఇండియా.. రూల్స్ వర్తించవు
డిగ్రీ చదివే రోజులలో మా రూమ్మేట్ ఒకడుండేవాడు. ఏదైనా పద్ధతిని పాటించే విషయంలో చర్చ వచ్చినప్పడల్లా ‘ఇది ఇండియా.. ఇక్కడ రూల్స్ గీల్స్ నై చల్తా’అనేవాడు. అదేంటని అడిగితే ‘ఇక్కడ రూల్స్ తోపాటే వాటిని బ్రేక్ చేసే మార్గాలు కూడా తయారవుతాయి. అందుకే ఎవరూ పాటించరు’అనేవాడు. అందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు చూపించేవాడు. ఎవరు ఎంత వాదించినా చివరకు ప్రతిసారీ అతనే గెలిచేవాడు. సుమారు ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కరోనా కాలంలో ఆయన మాటలు ఎంతటి అక్షరసత్యాలోనని…
కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…
డిజిటల్ దిశగా ప్రింట్ మీడియా?
కేవలం మూడేళ్లు కూడా నిండని ‘దిశ’ దినపత్రిక డిజిటల్ ప్లాట్ ఫాంపై సక్సెస్ కావడం దినపత్రికల రంగంలో పెను సంచలనం రేపింది. ప్రింట్ మీడియా విశ్వసనీయతతో సోషల్ మీడియా వేగంతో వార్తలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ‘దిశ’ ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు దీటుగా, చాలాసార్లు ముందుంటూ దూసుకుపోతోంది. ‘దిశ’ను శత్రువుగా భావించేవాళ్లు సైతం ఒప్పుకుంటున్న రీతిలో మూలమూలనా విస్తరిస్తోంది. ‘దిశ’ గురించి, ‘దిశ’ డైనమిక్ ఎడిషన్ల గురించి తెలియని పల్లె, ‘దిశ’ న్యూస్…
ప్రాంతీయమే ప్రత్యామ్నాయమా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో ఆ అర్హతను కోల్పోయింది. పవర్‌లో ఉన్న పంజాబ్‌తోపాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఆ పార్టీ ఘోరంగా బొక్క బోర్లా పడింది. ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక దృష్టి కేంద్రీకరించినా యూపీలో కేవలం…
అన్నల రాజ్యం-6: మావోయిస్టు ప్రాంతాలపై త్వరలో భారీ దాడి?
(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) బస్తర్‌లో రాజ్యమేలుతున్న జనతన సర్కార్లను, మావోయిస్టు గెరిల్లాల ప్రాబల్యాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచ్చలవిడిగా హింసకు పాల్పడడం, హెలికాఫ్టర్లపై సైతం తెగబడడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తే తప్ప దేశాభివృద్ధి సాధ్యం కాదని, మధ్యభారతంలో వివిధ బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలు అమలు చేయడం కుదరదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదేపదే ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. దండకారణ్యం, ఆంధ్రా-ఒరిస్సా, జార్ఖండ్-బెంగాల్,…
మోడీ వాంట్స్ తెలంగాణ!
తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…
