2023లో కింగ్ మేకర్ కాంగ్రెస్.. ఎందుకు..? ఎలా..?

2022 వెళ్లిపోయింది. 2023 వచ్చేసింది. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో పరిశీలించడం ఎవరికైనా ఆసక్తికరమే. గత సంవత్సరమంతా పొలిటికల్ హీట్ హాట్ హాట్‌గా కొనసాగింది. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్, సడెన్‌గా దూకుడు పెంచిన బీజేపీ మధ్య పూర్తి స్థాయి యుద్ధమే నడిచింది. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, కవిత.. మరోవైపు మోడీ, షా, నడ్డా, బండి సంజయ్‌ కేంద్ర బిందువులుగా మారారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. విమర్శించుకున్నారు. మునుగోడు వేదికగా ఒక…

Read More

పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!

గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ పైన, మోడీ పైన కేసీఆర్ చేసిన విమర్శలన్నీ తనకు నిజాలు అనిపిస్తున్నాయట. మంచిదే కదా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన బండి సంజయ్…

Read More

ఓటర్లా..? బిచ్చగాళ్లా..?

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా అనేక మంది అధికార పార్టీ నేతలు తరచూ ప్రకటిస్తుంటారు. ఆ పథకాలపై విపక్షాల, ప్రజాసంఘాల విమర్శలు ఎలా ఉన్నా ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని సంక్షేమ పథకాలు, కేటాయిస్తున్నన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదనేది కఠోర వాస్తవం. 2021 నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్…

Read More

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు,…

Read More

కేసీఆర్ సార్.. మీరు మారాలి!

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రతిష్టకు అవమానకర భంగపాటు అని, ఇక రాష్ట్రంలో కమలనాథులదే…

Read More

ఆర్టీసీ ఒక్కటే ఎందుకు? ప్రభుత్వాన్నే అమ్మేయండి!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆస్తులను అమ్మాలని, లీజుకు ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇలా సమకూరిన ఆదాయాన్ని ఇప్పటికే పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని, భవిష్యత్తులో నష్టాల నివారణకు తక్షణం బస్సు చార్జీలు పెంచాలని కూడా ఆర్టీసీ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయని కొత్తగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. మూడు నాలుగు…

Read More

అందరిబంధు, పేదలబంధు రావాలి!

రాష్ట్రంలో ఇప్పుడంతా దళితబంధు పైనే చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌లో జరగనున్న ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తెచ్చారని, ఈటలను ఓడించడం కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారని అంటున్నారు. ఈ పథకం మూలంగా  ఆ నియోజకవర్గంలోని 45వేల పైచిలుకు ఎస్సీ ఓట్లలో కనీసం 80శాతం టీఆర్ఎస్ ఖాతాలో పడడం ఖాయమనే అభిప్రాయం వినవస్తోంది. ఈ ఎత్తుగడ వికటించే అవకాశమూ ఉందని, కేవలం దళితులకే లబ్ధి చేకూర్చడం వల్ల దళితేతర వర్గాలు ఆ పార్టీకి…

Read More

హుజూరాబాద్.. మినీ 2023?

ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును కేసీఆర్ రంగంలోకి దించారు. సిద్దిపేట సమీపంలోని రంగనాయక్‌సాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా ‘ఆపరేషన్ హుజూరాబాద్’ కొనసాగుతున్నది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, వీరవిధేయుడు ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో పల్లెపల్లెనా ఈటల వ్యతిరేక ప్రచారం కొనసాగుతున్నది. ఇప్పటికే మండలానికో మంత్రిని లేదా ఎమ్మెల్యేను, గ్రామానికో నేతను అన్నట్టుగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి యాభై లేదా వంద మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజ్‌మెంట్ పర్సన్‌ను కేటాయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడవద్దని…

Read More

కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…

Read More