లౌకికవాదులు కేసీఆర్ వెనకే చేరాలా?

మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (అప్పటికి) చాడ వెంకట్‌రెడ్డి ఆగస్టు 20న ప్రకటించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా టీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ…

Read More

ప్రభుత్వ ఉద్యోగులు పని చేయరా?

ప్రభుత్వ వైద్యులను జియో టాగింగ్ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన రాష్ట్రంలో దుమారం రేపుతున్నది. తామేమీ జంతువులం కాదని, అనుక్షణం తాము ఎక్కడున్నామో తెలుసుకోవడం అవసరం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఉద్యోగులలో పని ఎగవేసేవాళ్లు, డుమ్మా కొట్టేవాళ్లు, ఇతర అనైతిక పద్ధతులకు పాల్పడేవాళ్లు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఉన్నారని ఆ సంఘం పేర్కొంది. డాక్టర్ల వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో జియో టాగింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు…

Read More

టెంట్ or ఫ్రంట్? కేసీఆర్ జాతీయ ఎత్తుగడ ఏంటి?

కేసీఆర్ జాతీయ పార్టీ గురించిన చర్చ మరోమారు ఊపందుకుంది. దసరా రోజే కొత్త పార్టీకి అంకురార్పణ జరుగుతుందని గులాబీ బాస్ చెప్పినట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 11న హైదరాబాదుకు వచ్చిన ఆయన కేసీఆర్‌తో భేటీ అయి పలు విషయాలు చర్చించారు. అదే రోజు ప్రగతి భవన్ నుంచి వెలువడిన ప్రకటన కూడా కొత్త పార్టీ ఏర్పాటుపై మరింత స్పష్టతనిచ్చింది. ఇప్పటికే మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా…

Read More

రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

తెలంగాణలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరస మీటింగులతో ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. కమలం పార్టీ దేశానికి ఒక్క మంచి పని చేయలేదని, అన్నీ…

Read More

పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!

గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ పైన, మోడీ పైన కేసీఆర్ చేసిన విమర్శలన్నీ తనకు నిజాలు అనిపిస్తున్నాయట. మంచిదే కదా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన బండి సంజయ్…

Read More

కమల‘బంధం’లో తెలంగాణ

మూడు రోజులుగా కాషాయ జెండాలతో తెలంగాణ రెపరెపలాడిపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ పదాధికారులు దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. మోడీ పాలనను పొగుడుతూ, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తూలనాడుతూ ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. సమావేశాలు జరుగుతున్న రాజధాని హైదరాబాద్‌లో అయితే హడావుడి ఆకాశాన్నంటేలా ఉంది. నగర కూడళ్లలో, రోడ్లపై ఎక్కడ చూసినా బీజేపీ అగ్రనేతలను స్వాగతిస్తూ కట్టిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అధికార…

Read More

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్@పీకే టీం సర్వే నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు చేబడుతున్నారు.40 మంది వరకు…

Read More
Marokonam

చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదని, ఇతర పార్టీల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలమని స్పష్టం చేశారు.పవన్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీల ప్రభావంపై మరోమారు చర్చ ఊపందుకుంది. జనసేనతో పాటు…

Read More

2023: కౌన్ బనేగా సీఎం!?

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరి చేయ యత్నించారు. మోడీ పట్టించుకోకున్నా తాను పట్టించుకుంటానని రైతులకు సందేశం అందేలా వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇటీవల పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై ఆధారపడి…

Read More

కేసీఆర్‌లో ఓటమి భయం నిజమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బిహార్‌కు చెందిన పీకే తనవైన వ్యూహాలతో 2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని మోడీని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి మొదటిసారి వార్తల్లో నిలిచారు. ఆ ఊపుతో 2014…

Read More