కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్…

Read More

మోడీకి ప్రత్యామ్నాయం లేదా?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే రెండు దఫాలుగా పాలన సాగించిన ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన అనేక విమర్శలున్నా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలినా 2019 మే తర్వాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధిస్తూనే వుంది. చేజారుతుందని భావించిన ఉత్తరప్రదేశ్‌ 2022లో అనూహ్యంగా భారీ మెజారిటీతో తమ ఖాతాలో పడడం కమలనాథులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో…

Read More

లౌకికవాదులు కేసీఆర్ వెనకే చేరాలా?

మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (అప్పటికి) చాడ వెంకట్‌రెడ్డి ఆగస్టు 20న ప్రకటించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా టీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ…

Read More

టెంట్ or ఫ్రంట్? కేసీఆర్ జాతీయ ఎత్తుగడ ఏంటి?

కేసీఆర్ జాతీయ పార్టీ గురించిన చర్చ మరోమారు ఊపందుకుంది. దసరా రోజే కొత్త పార్టీకి అంకురార్పణ జరుగుతుందని గులాబీ బాస్ చెప్పినట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 11న హైదరాబాదుకు వచ్చిన ఆయన కేసీఆర్‌తో భేటీ అయి పలు విషయాలు చర్చించారు. అదే రోజు ప్రగతి భవన్ నుంచి వెలువడిన ప్రకటన కూడా కొత్త పార్టీ ఏర్పాటుపై మరింత స్పష్టతనిచ్చింది. ఇప్పటికే మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా…

Read More
Marokonam

చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదని, ఇతర పార్టీల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలమని స్పష్టం చేశారు.పవన్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీల ప్రభావంపై మరోమారు చర్చ ఊపందుకుంది. జనసేనతో పాటు…

Read More

కమ్యూనిస్టులు కనుమరుగేనా!

తెలంగాణ అంటేనే బయటి ప్రపంచానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు గుర్తొస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మేం తెలంగాణ నుంచి వచ్చామని చెప్తే, కాస్త అనుమానపు చూపులు చూడడం చాలా మందికి అనుభవమే. మనది పోరాటగడ్డ అని, జనాలలో తిరుగుబాటు మనస్తత్వం ఉంటుందని భావించడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 1946-51 మధ్య ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేతృత్వంలో కొనసాగిన రైతాంగ సాయుధపోరాటం చరిత్ర పుటలలో నిలిచిపోయింది. వేలాది రైతాంగ గెరిల్లాలు ఆయుధాలు చేబూని 41 వేల చ.కి.మీ….

Read More

కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…

Read More