దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?
(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…
