నక్సలైట్ నేతగా నేషనల్ మీడియాతో నా ఇంటర్వ్యూ..
జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రస్తుతం దిశ దినపత్రిక ఎడిటర్‌గా ఉన్నాను. 1998లో నేను డీకేలో ఉన్నప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పార్టీ తరఫున నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను….
