మునుగోడులో బీజేపీ ఓడింది.. మోడీ-షా గెలిచారు!
మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ తమ బలగాలను భారీగా మోహరించాయి. అర్థ, అంగ బలాలను విచ్ఛలవిడిగా వినియోగించాయి. ఓటుకు రూ. 3నుంచి 5వేల వరకు వెచ్చించాయి. టీఆర్ఎస్ వంద మంది వరకు మంత్రులు,…
