ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు….

Read More

కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమేనా!?

చూడబోతే, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహం సక్సెస్ అయ్యేట్టే కనిపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని వీరిద్దరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress mukt Bharat) కోసం బహిరంగంగానే పిలుపునిచ్చారు. వారి కృషి ఫలితమా, అన్నట్లుగా 2014లో మొదటి దఫా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హస్తం పార్టీ క్రమంగా బలహీనమవుతూ వస్తున్నది. ఆ యేడు కోల్పోయిన లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఐదేళ్ల అనంతరం…

Read More

బీఆర్ఎస్‌కు విప్లవశక్తుల అండ.. షరతులు వర్తిస్తాయి!

మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు టీఆర్ఎస్ వెనకాల చేరడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. వారి ఓటు బ్యాంకు కారు గుర్తుకు మళ్లడంతోనే పదివేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిని ఓడించడం సాధ్యమైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘వికసించిన ఎర్ర గులాబీ.. కారును గట్టెక్కించిన కామ్రేడ్లు’ అంటూ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. కమలనాథులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టుల మద్దతును కూడగట్టిన కేసీఆర్ వ్యూహ చతురతను అందరూ మెచ్చుకున్నారు. మొదటినుంచీ ఆ నియోజకవర్గంలో వామపక్షాలకు మంచి పట్టుందని, ఐదుసార్లు సీపీఐ అభ్యర్థులు విజయం…

Read More

లౌకికవాదులు కేసీఆర్ వెనకే చేరాలా?

మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (అప్పటికి) చాడ వెంకట్‌రెడ్డి ఆగస్టు 20న ప్రకటించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా టీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ…

Read More

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు,…

Read More

హుజూరాబాద్‌లో నోటుకు ఓటు విప్లవం!

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలుస్తారో ఎల్లుండికల్లా తేలిపోనుంది. ఈటల రాజేందర్ గెలుస్తారా లేక టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్ గెలుస్తారా? ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం కాని నోటుదే విజయమన్న విషయం మాత్రం రుజువైపోయింది. ఈ ఇద్దరు అభ్యర్థులూ విచ్ఛలవిడిగా ఓట్ల కోసం నోట్లు పంపిణీ చేశారు. అధికార పార్టీ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టివుండవచ్చు గాక, బీజేపీ సైతం వెనకపడలేదు. ఉన్నంతలో డబ్బులు పంచింది. ఆ…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More

ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ) ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత…

Read More

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో…

Read More