ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ) ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత…

Read More

అన్నల రాజ్యం-5: ఇళ్ల దహనాలు ఇక్కడ కామన్..

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలీ రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే బలగాలను దించి భయపెట్టే, బలప్రయోగం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు….

Read More

అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది. అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే….

Read More

అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి…

Read More

అన్నల రాజ్యం-2: నాలుగు జిల్లాల్లో సమాంతర సర్కార్లు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) కటిక చీకట్లలో కడు పేదరికంతో కూడు, గూడు, గుడ్డ కరువైన దీనస్థితిలో బతుకుతున్న బస్తర్ ఆదివాసులకు 1980లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించిన నక్సలైట్లు దేవుళ్లలా కనిపించారు. అభివృద్ధి పేరుతో అటవీ సంపదను, ఖనిజ వనరులను దోచుకెళుతున్న ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నలు చెప్పిన మాటలను మొదట వాళ్లు నమ్మలేదు. అయితే కాలక్రమంలో పాలకుల పట్టించుకోనితనం, అటవీ సిబ్బంది అరాచకాలు, కాంట్రాక్టర్ల, షావుకార్ల దోపిడి వారిని మావోయిస్టులకు దగ్గర…

Read More

అన్నల రాజ్యంలో ఆరు రోజులు: బస్తర్‌లో మావోయిస్టు సర్కారు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మధ్యభారత అడవుల్లో ఓ కొత్త వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. దేశ వనరులను బహుళజాతి సంస్థలకు దఖలు పరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అక్కడి ఆదివాసీలు తిరగబడుతున్నారు. మావ నాటె మావ రాజ్ (మా ఊళ్లో మా ప్రభుత్వం) అనే నినాదంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ అండతో ఊరూరా క్రాంతికారీ జనతన సర్కార్ల (విప్లవ ప్రజా సమితి)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమిస్తున్నారు. మానవజాతి మనుగడకు,…

Read More

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడు తూ స్వేచ్ఛగా, దర్జాగా బతికిన మాడియా గోండులు ఏ క్షణం ఏం జరుగుతుం దో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకురానుందో తెలియక భయంభయంగా బతుకుతున్నారు. ఉధృతంగా సాగుతున్న మావోయిస్టుల కార్యకలాపాలు, ఆ కార్యకలాపాల అణచివే త పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాల ముప్పేట దాడులు కలిసి వారి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.శిక్షణ స్కూలు నెపంతో గుట్టల అంచున…

Read More

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే,…

Read More

బస్తర్.. భారత యేనాన్..

‘‘దండకారణ్యం భారతదేశంలోని అరుణారుణ ప్రాంతం నుంచి ఢిల్లీకి తిరిగివస్తుంటే.. నాకు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఉత్తర షాంగ్సీ లోని యేనాన్ నుంచి కొమింగ్‌టాంగ్ రాజధాని సియాన్‌కు తిరిగివచ్చినట్లనిపించింది. కానీ నేనక్కడ నాలుగు నెలలు గడిపి రాలేదు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాను. చైనా విప్లవ కేంద్రమైన పొడి వాతావరణపు ఉత్తర షాంగ్సీకీ, ఇవాళ్టి భారత విప్లవ కేంద్రమైన దండకారణ్యానికీ, బస్తర్ అడవులకూ తేడాలు ఎన్నైనా ఉండవచ్చు. ప్రస్తుత పోరాటపు పర్యవసానం ఏమైనా కావచ్చు..’’ భారత…

Read More

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయని భావించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడడం, పైగా తన చావుకు అధికారుల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టించింది. 2002 బ్యాచ్‌కు చెందిన శర్మ గతం లో బస్తర్‌లోని దంతేవాడ జిల్లా…

Read More