జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్…

Read More

నక్సలైట్ నేతగా నేషనల్ మీడియాతో నా ఇంటర్వ్యూ..

జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రస్తుతం దిశ దినపత్రిక ఎడిటర్‌గా ఉన్నాను. 1998లో నేను డీకేలో ఉన్నప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పార్టీ తరఫున నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను….

Read More

అబూజ్‌మాడ్ గోండులు- జీవితం.. పోరాటం..

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దాడి సన్నాహాలు, మావోయిస్టుల ప్రతిదాడుల నేపథ్యంలో అబూజ్‌మాడ్ కొండలు మరోసారి వార్త ల్లోకెక్కాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బసర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ కొండలు మావోయిస్టులకు అడ్డాగా మారాయని, ఇక్కడి దట్టమైన అడవుల్లో శిక్షణ పొందుతూ బలగాలను సమీకరించుకుని పరిసర ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు నాయకత్వం కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతూ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలను సమన్వయిస్తోందని వారు చెబుతున్నారు. ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పిఎల్‌జీఏ)…

Read More