తాగునీటి పరాయీకరణ
పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త.. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే వీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండిగా లాభాలు గడిస్తున్న సామ్రాజ్యవాదులు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుళాయిల వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. గతవారం (2012 ఫిబ్రవరి 1-3) బెంగుళూరు నగరంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో నిర్వహించిన ప్రపంచ నీటి సదస్సు ఈ దిశలో వ్యూహాలను రచించింది. నీటి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు నిపుణులు, పరిశోధకులు,…
