ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు….

Read More

నోటి దూల ఆ పార్టీ నేతల జన్మహక్కు!

‘‘అధికారమివ్వడం ప్రజల వంతు.. వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం కాంగ్రెస్ నేతల వంతు’’ అన్నది పాత సామెత. ‘‘నోటి దుల నేతల వంతు.. ఓడించడం ప్రజల వంతు’’ అనేది కొత్త సామెత. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని, సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కలువక తప్పదని ఆయన చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అలా అనలేదని, తన మాటలను…

Read More

బీ టీంలే బీజేపీని గెలిపిస్తున్నాయా?

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అమలుచేస్తున్న పథకాలను కర్ణాటకలో కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. పార్టీ కర్ణాటక అధ్యక్షుడు పృథ్వీరెడ్డి కూడా ఇదే విషయాన్ని అనేక సభల్లో ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల పట్ల…

Read More

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్…

Read More

2023లో కింగ్ మేకర్ కాంగ్రెస్.. ఎందుకు..? ఎలా..?

2022 వెళ్లిపోయింది. 2023 వచ్చేసింది. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో పరిశీలించడం ఎవరికైనా ఆసక్తికరమే. గత సంవత్సరమంతా పొలిటికల్ హీట్ హాట్ హాట్‌గా కొనసాగింది. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్, సడెన్‌గా దూకుడు పెంచిన బీజేపీ మధ్య పూర్తి స్థాయి యుద్ధమే నడిచింది. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, కవిత.. మరోవైపు మోడీ, షా, నడ్డా, బండి సంజయ్‌ కేంద్ర బిందువులుగా మారారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. విమర్శించుకున్నారు. మునుగోడు వేదికగా ఒక…

Read More

బీఆర్ఎస్‌కు విప్లవశక్తుల అండ.. షరతులు వర్తిస్తాయి!

మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు టీఆర్ఎస్ వెనకాల చేరడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. వారి ఓటు బ్యాంకు కారు గుర్తుకు మళ్లడంతోనే పదివేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిని ఓడించడం సాధ్యమైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘వికసించిన ఎర్ర గులాబీ.. కారును గట్టెక్కించిన కామ్రేడ్లు’ అంటూ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. కమలనాథులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టుల మద్దతును కూడగట్టిన కేసీఆర్ వ్యూహ చతురతను అందరూ మెచ్చుకున్నారు. మొదటినుంచీ ఆ నియోజకవర్గంలో వామపక్షాలకు మంచి పట్టుందని, ఐదుసార్లు సీపీఐ అభ్యర్థులు విజయం…

Read More

మోడీకి ప్రత్యామ్నాయం లేదా?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే రెండు దఫాలుగా పాలన సాగించిన ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన అనేక విమర్శలున్నా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలినా 2019 మే తర్వాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధిస్తూనే వుంది. చేజారుతుందని భావించిన ఉత్తరప్రదేశ్‌ 2022లో అనూహ్యంగా భారీ మెజారిటీతో తమ ఖాతాలో పడడం కమలనాథులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో…

Read More

దృష్టి మళ్లింపు వ్యూహంలో భాగమే బీఆర్ఎస్!

కేసీఆర్ కొత్త పార్టీపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. దేశ్ కీ నేతా కేసీఆర్.. అంటూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆయన పార్టీ చేసేదేముండదని కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు విమర్శించాయి. ఇప్పటికే అధికార పార్టీ వెనక చేరిన సీపీఐ, సీపీఎం మాత్రమే  స్వాగతించాయి. కాగా, ఢిల్లీ స్థాయిలో కొత్త పార్టీ ప్రకటనపై స్పందన కరువైంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను ఎవరూ పెద్దగా పట్టించుకోనేలేదు. ప్రత్యేక రాష్ట్ర…

Read More

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్@పీకే టీం సర్వే నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు చేబడుతున్నారు.40 మంది వరకు…

Read More