నోటి దూల ఆ పార్టీ నేతల జన్మహక్కు!

‘‘అధికారమివ్వడం ప్రజల వంతు.. వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం కాంగ్రెస్ నేతల వంతు’’ అన్నది పాత సామెత. ‘‘నోటి దుల నేతల వంతు.. ఓడించడం ప్రజల వంతు’’ అనేది కొత్త సామెత. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని, సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కలువక తప్పదని ఆయన చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అలా అనలేదని, తన మాటలను…

Read More

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్…

Read More

మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వస్తున్నట్లు?

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ తర్వాత ఇప్పుడు మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరగనుంది. 2018 ఎన్నికలలో అక్కడ గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ్యత్వాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన గురువారం రాజీనామా చేశారు. తాను పార్టీని వదిలి వెళ్లడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే కారణమని, అనేకమార్లు పార్టీలు మార్చి, ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పనిచేయలేనని ఈ…

Read More

పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!

గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ పైన, మోడీ పైన కేసీఆర్ చేసిన విమర్శలన్నీ తనకు నిజాలు అనిపిస్తున్నాయట. మంచిదే కదా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన బండి సంజయ్…

Read More

2023: కౌన్ బనేగా సీఎం!?

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరి చేయ యత్నించారు. మోడీ పట్టించుకోకున్నా తాను పట్టించుకుంటానని రైతులకు సందేశం అందేలా వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇటీవల పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై ఆధారపడి…

Read More

కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

అక్కడ పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ!

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ కాకుండా 15మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా, ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకూ ఉంది. చివరకు బరిలో ఎంతమంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే…

Read More

రేవంత్‌రెడ్డి టార్గెట్ 2023 ఇదే!

2018 ప్రారంభంలో నాకు తెలిసిన ఓ మేధావి మిత్రుడు రేవంత్‌రెడ్డిని కలిసారు. అప్పటికి ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మూడు, నాలుగు నెలలవుతోంది. ఆయనకు పీసీసీ సారథ్య బాధ్యతలు ఇస్తారని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం అభ్యర్థి అని తెలుగు మీడియా కోడై కూస్తున్నది. అదే విషయాన్ని నా మిత్రుడు ప్రస్తావిస్తే, ప్రస్తుతం తన టైం రాలేదని, చేయాల్సిన పనులు చాలా మిగిలివున్నాయని అన్నారట. హైకమాండ్ వెంటనే తనకు ఆ పదవి ఇచ్చినా తీసుకోవడం…

Read More

రేవంత్ చికిత్స ఫలించేనా!

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. అంతర్గత కుమ్ములాటలతో అధ్వానస్థితికి చేరిన రాష్ట్ర యూనిట్‌కు సారథ్యం వహించే బాధ్యతను ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అందరూ ఊహించిన విధంగానే పలువురు సీనియర్ నేతలు ఈ నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. గాంధీభవన్ మెట్లెక్కనని ఒకరు.. రాజీనామా చేస్తున్నానని మరొకరు.. కాంగ్రెస్ ఇక టీటీడీపీగా మారుతుందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రెండున్నరేళ్ల పాటు నిర్ణయాన్ని నాన్చిన హైకమాండ్…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More