ఆసిఫాబాద్ లో మావోయిస్టులు.. డిజీపీ ప్రెస్ మీట్‌పై ఉత్కంఠ..
మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ లో కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? తెలంగాణ కేడర్ ఉన్నారా? మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్లేనా? వంటి విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే, ఆ సస్పెన్స్ ఈరోజు వీడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టులో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాటును లేదంటే అరెస్ట్ ను చూపించడానికే ఈ సమావేశం…
