దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?

(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…

Read More

మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?

(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి…

Read More

ఆపరేషన్ కగార్.. మావోయిస్టు పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే!

ఆపరేషన్ కగార్‌ను అంచనా వేయడంలో జరిగిన ఘోర తప్పిదం మూలంగానే మావోయిస్టు పార్టీ.. చరిత్రలోనే కనీ వినీ ఎరుగని నష్టాలను చవిచూసిందా? ఆ పార్టీ కార్యదర్శి బసవరాజ్ సహా పలువురు సీసీ, ఎస్‌జెడ్సీ, డీవీసీ సభ్యులు, హిడ్మా సహా పీఎల్జీఏ బెటాలియన్, కంపెనీ, ప్లాటూన్ల కమాండర్లు, కీలక సభ్యులు చనిపోవడానికి పొలిట్‌బ్యూరో తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమా? 2024 ఆగస్టులో విడుదల చేసిన సర్క్యులర్‌లో పార్టీ శ్రేణులకు, గెరిల్లా బలగాలకు సరైన వ్యూహం-ఎత్తుగడలను కనుక సూచించి ఉంటే…

Read More

కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమేనా!?

చూడబోతే, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహం సక్సెస్ అయ్యేట్టే కనిపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని వీరిద్దరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress mukt Bharat) కోసం బహిరంగంగానే పిలుపునిచ్చారు. వారి కృషి ఫలితమా, అన్నట్లుగా 2014లో మొదటి దఫా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హస్తం పార్టీ క్రమంగా బలహీనమవుతూ వస్తున్నది. ఆ యేడు కోల్పోయిన లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఐదేళ్ల అనంతరం…

Read More

మునుగోడులో బీజేపీ ఓడింది.. మోడీ-షా గెలిచారు!

మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ తమ బలగాలను భారీగా మోహరించాయి. అర్థ, అంగ బలాలను విచ్ఛలవిడిగా వినియోగించాయి. ఓటుకు రూ. 3నుంచి 5వేల వరకు వెచ్చించాయి. టీఆర్ఎస్ వంద మంది వరకు మంత్రులు,…

Read More

కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

కేసీఆర్ ఢిల్లీ వ్యూహాలు ఫలించేనా!

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈ వారం వార్తల్లో నిలిచింది. ఈ నెల 1న వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. విభజన సమస్యలు, జలవివాదాలు, రాష్ట్రాభివృద్ధికి నిధులు సహా పలు అంశాలను ఆయన వారితో చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. కాగా, కేసీఆర్-మోడీల భేటీ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన నాలుగు శాసనసభ…

Read More

కేసీఆర్ మదిలో మధ్యంతర ఎన్నికలు?

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. లెక్క ప్రకారం 2023 డిసెంబర్ వరకూ ప్రస్తుత శాసనసభ కాలం ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. దళితులను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించడానికే అంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన చేసిన ప్రసంగం వింటే త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. దళితబంధును రాష్ట్రమంతా పకడ్బందీగా అమలుచేస్తామని, దళితవాడల్లో అన్ని…

Read More