మల్లోజుల, ఆశన్న ఆధ్వర్యంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ.. ఏర్పడేది అప్పుడే!
మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నది. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పని చేయనున్నది. ఒక జాతీయ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్‌లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళతారా? అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ‘‘ప్రజల కోసం…
