కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వస్తున్నట్లు?

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ తర్వాత ఇప్పుడు మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరగనుంది. 2018 ఎన్నికలలో అక్కడ గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ్యత్వాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన గురువారం రాజీనామా చేశారు. తాను పార్టీని వదిలి వెళ్లడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే కారణమని, అనేకమార్లు పార్టీలు మార్చి, ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పనిచేయలేనని ఈ…

Read More

పౌరులపై ‘సాయుధ’ చట్టం ?!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై…

Read More

అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది. అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే….

Read More

కేసీఆర్‌లో ఓటమి భయం మొదలైందా?

  దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బిహార్‌కు చెందిన పీకే తనవైన వ్యూహాలతో 2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని మోడీని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి మొదటిసారి వార్తల్లో నిలిచారు….

Read More

టీ-కాంగ్రెస్.. వీళ్లు మారరా!?

జగ్గారెడ్డి ఉదంతం మరోసారి టీ-కాంగ్రెస్‌ను వార్తల్లో నిలిపింది. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, పైగా కోవర్ట్‌ గా ముద్ర వేసి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవల రాజీనామాకు సిద్ధమయ్యారు. పలువురు సీనియర్ నేతలు బతిమాలినా తన నిర్ణయాన్ని మార్చుకోబోవడం లేదని ప్రకటించారు. పార్టీ అధినేత్రి సోనియాకు, యువనేత రాహుల్‌కు ఈ సందర్భంగా ఆయన మూడు పేజీల లేఖ రాశారు. పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని దుయ్యబట్టారు….

Read More

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును చర్చకు పెట్టే వీలు కుదరకపోవడంతో కేంద్ర కేబినెట్ హడావుడిగా గత బుధవారం ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించి సంతకం కోసం రాష్ట్రపతికి పంపించింది.శుక్రవారం రాజ్యాంగ అధినేత అయిన ప్రణబ్ ఆమోదముద్ర కూడా వేశారు. సోనియాగాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు భారత పౌరుల్లో మూడింట రెండు వంతుల జనాభాకు ఆహార భద్రతను కల్పిస్తుంది. జీవించడానికి అవసరమైన…

Read More

నిరుద్యోగుల ఓటు ఎటువైపు?

ఢిల్లీలో ఇటీవల టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఒక నివేదిక సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను ఇందులో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని తాము చేసిన విస్తృత సర్వే వివరాలను తెలియపరచారు. ఈ సర్వే వివరాలను గోప్యంగా ఉంచినా, అందులో పాల్గొన్న ఓ నాయకుడి సమాచారం మేరకు టీఆర్ఎస్‌కు 38 శాతానికి తగ్గకుండా…

Read More

బిడ్డకు చేతితో తినిపించినా అక్కడ నేరం!

(2012 జనవరిలో రాసిన వ్యాసం ఇది..) ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ్ఞాన శాస్త్రజ్ఞునిగా పని చేస్తున్న అనురూప్ దంపతులు తమ సంతానం మూడేళ్ల అభిజ్ఞాన్, ఏడాది పాప ఐశ్వర్యలపై మమతానురాగాలను చూపించడం లేదన్న కారణంగా అక్కడి బాలల సంరక్షణ చట్టాల ప్రకారం వారిపై కేసు నమోదయింది. కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం పిల్లలిద్దరినీ వారికి 18 ఏళ్లు నిండేవరకూ తల్లిదండ్రుల…

Read More