అమెరికాలో ఇప్పటికీ బానిస వ్యవస్థ!
ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్లలో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీలు వందల కోట్లు గడిస్తున్నాయి. శతాబ్దాల క్రితం డబ్బూ మందీ మార్బలం ఉన్న తెల్ల దొరలు ఆఫ్రికా అడవుల నుంచి నల్ల జాతీయులను బంధించి తెచ్చి బానిసలుగా ఉపయోగించుకోవడం గురించి మనకు తెలుసు. కాని కుట్రపూరితంగా నేరాలను ప్రోత్సహిస్తూ, తదనుగుణంగా చట్టాలనూ, శిక్షలనూ ఇష్టానుసారం మార్చుకుంటూ ఖైదీలను నయా బానిసలుగా ఉపయోగించుకుంటున్న వైనం చాలా తక్కువ మందికి తెలుసు….
