ఆధార్ ప్రక్రియ అంతా గందరగోళమే..
పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం.. దేశ జనాభాలో కేవలం పది శాతం మందికి కార్డుల జారీ తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది. పార్లమెంటులో కనీస చర్చ లేకుండా 30వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారని కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా పలువురు మేధావులు ప్రారంభంలోనే…
