వారి త్యాగాలను గౌరవిద్దాం!
‘విప్లవ మేధావి, మావోయిస్టు నేత ఎల్ఎస్ఎన్ మూర్తి క్యాన్సర్కు చికిత్స పొందుతూ గత బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. యాభై సంవత్సరాలకు పైగా పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఆయనకు సొంత కుటుంబం కానీ, ఆస్తి కానీ లేవు. కొంతమంది దాతల సాయంతో నగర శివారులోని సీఆర్ ఫౌండేషన్లో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందారు.’ ‘సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన యాభై ఐదేళ్ల ఆలూరి ఉష క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవలే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ముప్పై ఏళ్ల తర్వాత జనజీవన…
