పాత్రికేయ ప్రస్థానం@20: అక్షరం ఆగదు… దిశ మారదు…
వినాయక చవితి పండుగ రోజు. సంస్థకు సెలవు ప్రకటించినప్పటికీ స్వచ్ఛందంగా పనిచేస్తామన్న డజను మంది స్టాఫ్‌తో స్పెషల్ ఎడిషన్ తెద్దామనే ప్రయత్నంలో సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఏడు గంటల సమయంలో మిత్రుడు గోపాల్ కాల్ చేశాడు. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూలు ఫస్ట్ బ్యాచ్ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం. నువ్ వస్తావా? అన్నాడు. నేను యెస్ చెప్పాను. ఆ వెంటనే ఆ బ్యాచ్ వాట్సాప్ గ్రూపులో నన్ను యాడ్ చేశాడు. ఎలా చేద్దాం? ఎక్కడ చేద్దాం? అప్పటి…
