అబూజ్‌మాడ్‌పై త్వరలో సైనిక దాడి..?
(డి మార్కండేయ) మావోయిస్టులు గెరిల్లా స్థావరంగా ప్రకటించుకున్న అబూజ్మడ్ ప్రాంతంపై త్వరలో భారీ ఎత్తున సైనిక దాడి జరగనుందని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న కేంద్ర బలగాలకు తోడు మరిన్ని బలగాలను పంపించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు యూపీఏ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకూ ఎలాంటి సర్వే జరగని ఈ అబూజ్మడ్ కొండల ప్రాంతాన్ని…
