అబూజ్మాడ్పై దాడి-2: సైన్యాన్ని దించుతారా..?
(డి మార్కండేయ) దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో దుర్భేద్యమైన బెర్రయిన్ను కలిగివున్న అబూజ్మడ్ ప్రాంతంపై దాడి చేయడమంటే మాటలు కాదు. ఏ దారి ఎటు వెళుతుందో, ఏ పల్లె ఎక్కడుందో, ఎక్కడ ఏ వాగు అడ్డం తగులుతుందో, ఏ వ్యక్తి ఏ ఊరికి చెందినవాడో, ఏ మూలన ఏ ప్రమాదం పొంచివుందో స్థానిక ఆదివాసులకు తప్ప బయటి వారికి అసలే తెలియని ప్రాంతమిది.. ఎక్కడికి చేరాలన్నా కాలినడక తప్ప మరో మార్గం లేదు. సముద్రమట్టానికి…
