రాజకీయాలు ఇప్పుడు పక్కా బిజినెస్!!
కుంభకోణాలు, కేసులు, రాజకీయ వివాదాలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సహా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న పలువురి పాత్ర వుందనే ఆరోపణలతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే గులాబీ బాస్‌కు సన్నిహిత మిత్రుడైన బోయినపల్లి హన్మంతరావు కుమారుడు అభిషేక్‌ను, ఇంకొందరిని ఈ కేసులో జైలుకు పంపగా, మరికొందరిని ఆ సంస్థలు విచారిస్తున్నాయి. కవితకు, ఎంపీ సంతోష్‌కు త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. ఇదే ఈడీ చీకోటి ప్రవీణ్…
