అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?
సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే,…
